ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్‌ లో సమంతకు చైతూ రేటింగ్‌ ఎంతో తెలుసా?

అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే.దాంతో ఫ్యామిలీ మ్యాన్ కు సీజన్ 2 తీసుకు వస్తున్నారు.

 Hero Naga Chaitanya About Samantha The Family Man Season 2 Trailer , Naga Chaita-TeluguStop.com

రాజ్ అండ్‌ డీకే ల దర్శకద్వయం రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2 స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది.గత ఫిబ్రవరిలోనే స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు వచ్చే నెలలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.వెబ్‌ సిరీస్ ను స్ట్రీమింగ్‌ చేయడం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సారి సౌత్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీ మ్యాన్ కోసం ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే ఈ వెబ్‌ సిరీస్‌ లో ముద్దుగుమ్మ సమంత కూడా కీలక పాత్రలో నటించింది.

అది కూడా నెగటివ్‌ రోల్‌ లో నటించినట్లుగా చెబుతున్నారు.పాకిస్తానీ ఉగ్రవాది గా కనిపించిన సమంత వల్ల ఇక్కడ ఎక్కవ ఇంట్రెస్ట్‌ ఉంది.

తాజాగా ఈ వెబ్‌ సిరీస్ ట్రైలర్ విడుదల అయ్యింది.ట్రైలర్‌ పై నాగచైతన్య స్పందించాడు.

నిన్న ఈ వెబ్‌ సిరీస్ కు సంబంధించిన తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ వెబ్‌ సిరీస్ రాబోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నట్లుగా ట్వీట్‌ చేశాడు.ఇక తాజాగా ట్రైలర్‌ విడుదల తర్వాత నాగ చైతన్య స్పందిస్తూ చాలా నచ్చింది అంటూ పదికి పది రేటింగ్‌ ఇచ్చేశాడు.

కేవలం ట్రైలర్‌ కే ఇంతగా రేటింగ్‌ ఇస్తే ఇక ముందు ముందు విడుదల కాబోతున్న వెబ్‌ సిరీస్ కు ఎంతగా రేటింగ్ ఇస్తాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.సమంత నటన ముఖ్యంగా ఆమె చెప్పే తమిళ డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

తమిళనాట ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌ మరియు అభిమానుల నేపథ్యంలో ఆమె వెబ్‌ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ వెబ్‌ సిరీస్ సక్సెస్ అయితే తప్పకుండా సమంత ముందు ముందు మరిన్ని వెబ్‌ సిరీస్ లను చేసే అవకాశం ఉదంటున్నారు.

మరో వైపు సమంత తెలుగు లో శాకుంతలం అనే సినిమా ను చేస్తోంది.ఇక తమిళంలో నయనతార మరియు విజయ్‌ సేతుపతి తో కలిసి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను సామ్‌ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube