ఫొటోటాక్‌ : అమీర్ ఖాన్‌ తో సెట్స్‌ లో నవ్వులు చిందిస్తున్న మన స్టార్‌

ఇటీవల కాలంలో అమీర్ ఖాన్‌ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.అందుకు కారణం ఆయన తన రెండవ భార్య కిరణ్‌ రావుకు విడాకులు ఇచ్చారు.

 Naga Chaitanaya And Ameer Khan On The Sets Of Lal Sing Chadda , Ameer Khan, Boll-TeluguStop.com

ఆయన రెండవ సారి కూడా 15 ఏళ్లకు సరిగ్గా విడాకులు ఇవ్వడం వెనుక రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ప్రధానంగా అమీన్ ఖాన్‌ కు భార్యలు అంటే మరీ లోకువ అయ్యారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

హిందువులు ఒక రేంజ్ లో ఆయన్ను టార్గెట్‌ చేసిన ఈ సమయంలో ప్రస్తుతం ఆయన చేస్తున్న లాల్‌ సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌ జరుగుతోంది.ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

లద్దాఖ్‌ లో చివరి షెడ్యూల్‌ ను నిర్వహిస్తున్నారు.ఈ సినిమాలో మన హీరో నాగచైతన్య కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

అమీర్ ఖాన్‌ తో పాటు నాగచైతన్య లద్దాఖ్‌ లో షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.ఆ ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసిన హీరోలు తమ ఆనందంను షేర్‌ చేసుకున్నారు.

ఇద్దరు కూడా ఆర్మీ డ్రస్స్‌ ల్లో ఉన్నారు.వీరిద్దరు సినిమాలో మంచి స్నేహితులుగా కనిపిస్తారట.20 రోజుల పాటు లద్దాఖ్‌ లో షూటింగ్ నిర్వహిస్తారు.దాంతో నాగచైతన్య పోర్షన్‌ పూర్తి అవుతుందట.

సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అమీర్‌ ఖాన్‌ వరుస విజయాలతో దూసుకు పోతున్న సమయంలో అనూహ్యంగా ఒక ప్లాప్‌ పడింది.దాంతో ఆయన ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీసుకుని చేస్తున్నాడు.ఇండస్ట్రీలో ఈ సినిమా మరో రేంజ్ లో సక్సెస్‌ అవుతుందని కొందరు అంటున్నారు.

నాగ చైతన్య మొదటి హిందీ సినిమా అవ్వడంతో మనోళ్లలో కూడా భారీగా ఆసక్తి కనిపిస్తోంది.మరి చైతూకు సక్సెస్ దక్కేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube