ప్రైవేట్ జెట్ లో రవితేజ, నాగబాబు ప్రయాణం.. మాస్ రాజపై సెటైర్లు వేసిన మెగా బ్రదర్?

Naga Babu With Ravi Teja In Private Flight

మాస్ మహారాజ రవితేజ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి హిట్స్ లేక ఎంతో సతమతమయ్యారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో మరోసారి ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.

 Naga Babu With Ravi Teja In Private Flight-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో రవితేజ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా మెగా బ్రదర్ నాగబాబు రవితేజ ఒక ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా అసలు వీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అంటూ నెటిజన్లు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖీలాడి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

 Naga Babu With Ravi Teja In Private Flight-ప్రైవేట్ జెట్ లో రవితేజ, నాగబాబు ప్రయాణం.. మాస్ రాజపై సెటైర్లు వేసిన మెగా బ్రదర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒక పాటను చిత్రీకరించడం కోసం చిత్రబృందం దుబాయ్ వెళ్లినట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ క్రమంలోనే దుబాయిలో రవితేజ, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, డింపుల్ హైయతీ పై ఈ పాటను షూట్ చేస్తున్నట్లు తెలిపారు.

Telugu Dimple Hayathi, Dubai, Khiladi, Naga Babu, Private, Ravi Teja, Tollywood-Movie

అయితే రవితేజ సినిమాకి నాగబాబుకి మధ్య సంబంధం ఏమిటి అనే విషయం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.రవితేజ సినిమాలో నాగబాబు ఎలాంటి పాత్ర పోషించక పోయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేయడం అందరిలో పలు అనుమానాలను కలిగిస్తోంది.అయితే ఇది ఇప్పటి ఫోటో కాదని గత కొద్ది రోజుల క్రితం నాగబాబు రవితేజ కలిసి ఒక ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేశారు మరి అప్పటి ఫోటోలు ఇప్పుడు షేర్ చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక నాగబాబు ఈ ఫోటోని షేర్ చేస్తూ రవితేజ పక్కన ఉంటే నవ్వులేనవ్వులు అతను ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడనీ రవితేజ గురించి చెప్పుకొచ్చాడు.

#Naga Babu #Private #Khiladi #Dimple Hayathi #Khiladi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube