మెగా బ్రదర్ తెలుగులో ఇప్పటి వరకు చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు.కాని మొదటి సారి ఈయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
అది కూడా విలన్ పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన చత్రపతి సినిమా ను వి వి వినాయక్ బాలీవుడ్ లో అల్లుడు శీను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా ను తెలుగు స్టార్స్ తో నింపేస్తున్నాడు.అందులో భాగంగానే ఒరిజినల్ వర్షన్ లో ప్రదీప్ రావత్ పోషించిన రాస్ బిహారి పాత్రను హిందీ లో నాగబాబు తో చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల నాగబాబు సోషల్ మీడియా హ్యాండిల్ నుండి కొన్ని రఫ్ లుక్ ఫొటోలు మీడియా ముందుకు వచ్చాయి.ఆ పొటోల ఉద్దేశ్యం చత్రపతి రీమేక్ అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విషయమై చర్చలు జోరుగా సాగుతున్నాయి.చత్రపతి సినిమా లో రాస్ బిహారి పాత్ర అత్యంత కఠినంగా క్రూరంగా ఉంటుంది.
మరి అలాంటి పాత్రను నాగబాబు మొదటి సారి విలన్ గా నటిస్తూ న్యాయం చేయగలడా అంటూ టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే ప్రభాస్ పాత్ర చత్రపతికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యాయం చేస్తాడా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్న సమయంలో ఇప్పుడు రాస్ బిహారి పాత్రను నాగబాబు చేతిలో పెట్టడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వి వి వినాయక్ నిర్ణయాల ప్రభావం ఖచ్చితంగా సినిమా పై ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మరో నెల రెండు నెలల్లో చత్రపతి హిందీ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.