కత్తి విషయంలో సీఎంలకు నాగబాబు విజ్ఞప్తి, కఠినంగా శిక్ష పడాల్సిందే       2018-07-04   23:46:20  IST  Raghu V

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌తో ఫేమస్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ తర్వాత పవన్‌పై వరుసగా వివాదాస్పద కామెంట్స్‌ చేయడంతో మరింతగా ఫేమస్‌ అయ్యాడు. ఆయన్ను పవన్‌ ఫ్యాన్స్‌ తిట్టడం, ఆ తర్వాత ఆయన వైకాపాకు దగ్గర అవుతున్నట్లుగా మీడియాలో వార్తలు రావడం ఇలా పలు రకాలుగా కత్తి మహేష్‌ మీడియాలో చాలా ఫేమస్‌ అయ్యాడు. పవన్‌పై అంతకు ముందు వరకు ఏ ఒక్కరు అనని, అనలేని మాటలను కత్తి మహేష్‌ అనేశాడు. దాంతో కత్తి మహేష్‌పై మెగా ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఫైర్‌ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కత్తి మహేష్‌పై బౌతిక దాడులకు కూడా పవన్‌ ఫ్యాన్స్‌ ప్రయత్నాలు చేశారు అంటే అతిశయోక్తి కాదు.

అలాంటి కత్తి మహేష్‌ తాజాగా రామాయణంపై మరియు రాముడు, సీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంత కాలం పవన్‌పై వ్యాఖ్యలకు బాహాటంగా ఏ ఒక్కరు స్పందించలేదు. సోషల్‌ మీడియాలోనే కత్తి మహేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా రామాయణంపై ఆయన చేసిన వ్యాఖ్యలను హిందు సంఘాల వారు తప్పుబడుతున్నారు. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇటీవలే కత్తి మహేష్‌ను అరెస్ట్‌ చేసి, బెయిల్‌పై విడుదల చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో మెగా ఫ్యామిలీ నుండి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా నాగబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ కత్తి మహేష్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కత్తి మహేష్‌ వంటి వ్యక్తులు సమాజంకు చేటు అని, అతడి వల్ల మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని అన్నాడు. రామాయణం అంటే ఒక పుస్తకం కాదని, హిందువులు ఎంతో నమ్మే దైవ స్వరూపం అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. మత విద్వేశాలను రెచ్చగొట్టే కత్తి మహేష్‌పై కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు మెగా బ్రదర్‌ నాగబాబు విజ్ఞప్తి చేయడం జరిగింది.

గతంలో కత్తి మహేష్‌ పదే పదే పవన్‌పై మరియు మెగా ఫ్యాన్స్‌పై విమర్శలు చేస్తున్న సమయంలో కూడా నాగబాబు ఇండైరెక్ట్‌గా కౌంటర్‌ వేయడం జరిగింది. కత్తి మహేష్‌ తీరుపై మొదటి నుండి చాలా అసహనంగా ఉన్న నాగబాబు తాజాగా అతడిపై కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశాడు. మెగా ఫ్యామిలీ నుండి ఇలాంటి స్పందన ఈ విషయంలో వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. అయితే ఆవేశపరుడు అయిన నాగబాబు ఇలా తనకు కత్తిపై ఉన్న ఆగ్రహంను బయటకు తీసుకు వచ్చి కక్కేశాడు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంతో కూడా కత్తికి మళ్లీ ఫుల్‌ పబ్లిసిటీ దక్కేసింది.