ఎక్స్‌ఫోజింగ్ లొల్లిపై నాగబాబు హాట్ కామెంట్స్.! యాంకర్ రష్మి, అనసూయ రియాక్షన్ ఇదే!  

  • మై ఛానెల్ నా ఇష్టం’ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన నాగబాబు ఇంతకుముందు నందమూరి బాలకృష్ణపై రకరకాల కామెంట్స్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆడవాళ్ళ డ్రెస్సులపై జరుగుతున్న పరిణామాలపై కామెంట్స్ చేశారు. ఇటీవల కొందరు ప్రముఖులు ఆడవాళ్లు సంప్రదాయకరమైన దుస్తులు ధరించకపోవటం మూలంగానే హత్యాచారాలు ఎక్కువైపోయాయని అన్నారు. వాళ్ళు చెప్పిన ఆ మాటలపైన తన స్టైల్ లో స్పందించారు నాగబాబు.

  • అమ్మాయిలు చక్కని దుస్తులు వేసుకుంటే సమాజంలో అఘాయిత్యాలు తగ్గుతాయని, వారి దుస్తుల విషయంలో జాగ్రత్తలు వహించాలని వీళ్ళు చెప్పడం ఏంటని ఆ వీడియో ద్వారా ప్రశ్నించారు నాగబాబు. ఆడవారి డ్రెస్సుల విషయంలో మాట్లాడే అధికారం మీకెవరిచ్చారు? అంటూ వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్ళ డ్రెస్సులు వారిష్టం. ఒకవేళ శృతిమించితే చూసుకోవటానికి చట్టమంటూ ఒకటుంది. మీరంతా ఆడవారిని చూసే చూపులో లోపముంది తప్ప వారిలో లేదు అని పేర్కొంటూ విరుచుకుపడ్డారు నాగబాబు.

  • ఈ వీడియోపై జబర్దస్త్ యాంకర్స్ రష్మీ, అనసూయ రియాక్ట్ అయ్యారు. ఆడవారికి మద్దతుగా మాట్లాడినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ‘‘ధరించే దుస్తులను బట్టి మనిషిలోని గొప్పతనాన్ని అంచనా వేయలేం. దానిని వాళ్లు వేసుకునే దుస్తుల వైపు నుంచి చూడకండి. మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు నాగబాబు సార్’’ అని పేర్కొంది రష్మి.

  • Naga Babu Counter To ORTHODOX Fools Rashmi And Anasuya Supports-

    Naga Babu Counter To ORTHODOX Fools Rashmi And Anasuya Supports

  • Naga Babu Counter To ORTHODOX Fools Rashmi And Anasuya Supports-
  • అనసూయ స్పందిస్తూ…ఆయనపై గౌరవం మరింత పెరిగిందని తెలిపారు. అనసూయ కూడా డ్రెస్సింగ్ విషయంలో తరచూ విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.