మన హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో వచ్చే తొలి పండుగ నాగపంచమి.స్కంద పురాణం ప్రకారం లోకనాథడే నాగ పంచమి రోజున ఆచరించాల్సిన విధులు పార్వతీదేవికి తెలియజేశారని చెబుతోంది.
ఈ క్రమంలోనే శ్రావణమాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగు పాముకు జాజి,సంపెంగ, గన్నెరు పుష్పాలతో ప్రత్యేక పూజలు చేస్తారు.నాగు పాముకు, పుట్టల్లో పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తారు.
అసలు నాగు పంచమి జరుపుకోవడానికి కారణం ఏమిటి? ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది? పండుగ రోజు ఏ విధమైనటువంటి పాములను పూజించాలి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం….
పురాణాల ప్రకారం ఆది శేషుడు సేవలకు మెచ్చిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని ఆదిశేషునికి తెలియజేశాడు.
అందుకు ఆదిశేషుడు తాము ఉద్భవించిన శుద్ధ పంచమి రోజున లోకం మొత్తం సర్ప పూజలు చేయాలని ఆదిశేషుడు తన కోరికను తెలియజేశాడు.ఈ క్రమంలోనే విష్ణుమూర్తి నీ కోరిక నెరవేరుతుందని చెప్పి.
లోకం మొత్తం శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున పూజలు నిర్వహిస్తారని చెబుతాడు.అందుకోసమే మనం శ్రావణ మాసంలో పంచమి రోజున నాగపంచమి పండుగను నిర్వహించుకుంటారు.
మరి ఈ ఏడాది నాగ పంచమి ఆగస్టు 13న వచ్చింది.
ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లి అయిన జంటలు పెద్ద ఎత్తున నాగ పంచమి వేడుకలు చేసుకుంటారు.18 రోజు ఉదయమే పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉపవాసంతో నాగదేవతను స్మరిస్తూ పూజలు చేస్తుంటారు.నాగ పంచమి రోజున స్వామివారికి గోధుమ రవ్వ తో తయారు చేసిన పాయసాన్ని పెట్టడం వల్ల స్వామివారు ప్రీతి చెందుతారు.
పంచమి రోజు భక్తులు పెద్ద ఎత్తున ఉపవాసముండి స్వామివారికి పూజలు చేస్తుంటారు.ఇంకా ఆదిశేషుని పూజ చేసే సర్ప స్తోత్రాలు పఠించడం వల్ల సర్ప దోషాలు ఉండవు.
నాగ పంచమి రోజు ఆదిశేషునికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల కాలసర్ప దోషాలు తొలగి పోవడమే కాకుండా ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.నాగ పంచమి రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించినచో వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకలసంపదలతో కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు.మరి ఇంత పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజు ముఖ్యంగా తొమ్మిది రకాల పాములను పూజించాలి.మరి ఆ తొమ్మిది రకాల పాములు ఏమిటంటే…అనంత, వాసుకి, శేష, కలియ, శంఖపాల, తక్షక, కంబాల, ధ్రుత రాష్ట్రం, పద్మనాభం వంటి రకాలను పూజిస్తారు.
LATEST NEWS - TELUGU