మన్మధుడు సినిమా చేసేటప్పుడు ఆ సీన్ టైం లో అసలు ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు.!   Nag Manmadhudu Movie Climax Scene Real Facts     2018-07-11   00:39:37  IST  Raghu V

“తెహెల్కా.కామ్: ఆకాశం నీలంగా ఉంది…

అభి: లేదే…నార్మల్ గానే ఉంది…

తెహెల్కా.కామ్: కోడ్ వాడండి…ఫోన్ లో చెప్పా కదా…

అభి: అది దేశ ద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు….”

ఈ పాటికే మీకు అర్థం అయిపోయి ఉండాలి…నేను దేని గురించి మాట్లాడుతున్నానో….త్రివిక్రమ్ గారి మ్యాజికల్ సెలులాయ్డ్ “మన్మధుడు” గురించి…నాగార్జున ఒక రేంజ్ లో ఆక్ట్ చేశారు ఈ మూవీ లో. బ్రహ్మానందం కామెడీ ఐతే ఎప్పటికీ మరిచిపోలేము…”సారీ అండీ అలా దిగాలా….ఇంకోసారి పారిస్ రండి, మా ఇంటికి రాకండి…ఇది ఇండియా కాదు పారిస్”….ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది…

ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే…ఈ సినిమా క్లైమాక్స్ సీన్ గుర్తుంది కదా…అదే అంది సోనాలి బింద్రే నాగార్జునకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తుంది. సునీల్ నాగార్జునను రావద్దు అంటాడు. తర్వాత సోనాలి ఫోన్ చేసేసరికి చెలియా చేజారిపోకూడదు అని కష్టపడి అంతర్వీది చేరుకుంటాడు. కానీ ఆ సమయంలో పెళ్లి వారు లాంచీ లో వెళుతుంటారు. కానీ నాగార్జునకి ఏమో నీళ్లంటే భయం. అయినా హారిక అని అరిచి దూకేస్తాడు. సోనాలి బింద్రే నీళ్ళలోకి దూకి అతన్ని కాపాడుతుంది. ఇదంతా తెరపై కనిపించింది. కానీ తేరా వెనక జరిగిన అసలు కథ అది కాదండోయ్.

వాస్తవానికి నీళ్లలోకి దూకడానికి భయపడింది సోనాలి …తనని నాగార్జున కాపాడాడు.