గత 2 నెలల పైగా బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది.ఇక కేవలం మూడు వారాలు మిగిలి ఉండటంతో ప్రస్తుతం బిగ్ బాస్ విజేత పై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
ఎప్పటిలాగానే ఈ సీజన్లో కూడా విజేత ఎవరన్నది ఇప్పటికే ప్రేక్షకులకు ఓ క్లారిటీ రానే వచ్చింది.ఇందులో భాగంగానే సోషల్ మీడియా నేపథ్యంలో అభిజిత్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
కంటెస్టెంట్స్ అందరూ ఒక వైపు తాను ఒక్కడే ఒకవైపు అంటూ తనదైన శైలిలో ఆట ఆడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అభిజిత్.దీంతో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు.

ఇందులో భాగంగానే ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ అందుకోలేని ఘనతను తాజాగా అభిజిత్ సాధించాడు.అతని అభిమానులు #We Admire Abhijeet అనే హ్యాష్ టాగ్ ను ఉపయోగించి జాతీయస్థాయిలో రెండు లక్షలకు పైగా ట్వీట్స్ చేసి అభిజిత్ పేరును ట్రెండింగ్ చేశారు.కేవలం అతని అభిమానులే కాదు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అభిజిత్ కు సపోర్ట్ చేస్తూ ఉండడంతో తాజా సీజన్ లో విజేత కచ్చితంగా అతడే అవుతాడని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది.
ఇదంతా ఒకవైపు ఇలా ఉండగా తాజాగా బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున భార్య అమల సపోర్ట్ దక్కడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.
అమల, అభిజిత్ ఇద్దరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తల్లి కొడుకుగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.తాజాగా అభిజిత్ గురించి అమల మాట్లాడుతూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా షూటింగ్ సమయంలో అభిజిత్ పెద్దల పట్ల మర్యాదగా ఉంటాడని తనతో ఉండే వారిని చాలా మర్యాదగా చూసుకుంటాడని.
బిగ్ బాస్ లో ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాడు అంటూ అమల తెలిపింది.అంతేకాదు ఏకంగా అభిజిత్ తన కొడుకు లాంటి వాడని ఆవిడ తెలిపింది.
ఆ సినిమాలో తాను అభిజిత్ కు అమ్మలా నటించిన బయట కూడా అతను తనను అమ్మలాగే చూసుకుంటాడని ఆవిడ చెప్పుకొచ్చింది.అంతేకాకుండా తనలాగే అతడికి కూడా మూగజీవాల పట్ల ఎంతో అభిమానం ఉందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అక్కినేని అమల అభిజిత్ కు మద్దతు ఇవ్వడంతో అతనికి ఎంత హెల్ప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.అయితే మరోవైపు నాగార్జున ఇదివరకు అభిజిత్ పట్ల కాస్త సీరియస్ గా మాట్లాడడం, ఇంకోవైపు నాగార్జున భార్య అమల సపోర్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యమే.