శృతి హాసన్ తో షార్ట్ ఫిలిం చేస్తున్న నాగ్ అశ్విన్

మహానటి సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్.సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమాతో జాతీయ అవార్డు సైతం దక్కించుకున్నాడు.

 Nag Ashwin Started Web Film With Shruti Hassan, Tollywood, Darling Prabhas, Pan-TeluguStop.com

వెండితెరపై మహానటి సావిత్రిని మరోసారి పరిచయం చేసిన నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ అందరూ ప్రశంసలు కురిపించారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యువ దర్శకుడు ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

అశ్వినీదత్ ఈ సినిమాని సుమారు 450 కోట్లతో నిర్మించడానికి రెడీ అయ్యారు.ఇక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం దీపికా పదుకునేని హీరోయిన్ గా ఖరారు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా పూర్తి చేయడంతో పాటు తరువాత ఓ రెండు నెలలు ఆది పురుష్ కోసం డేట్స్ ఇచ్చారు.ఈ నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ కాస్తా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్ పూర్తి స్థాయిలో స్టార్ట్ కావడానికి మరికొంత సమయం పడుతుంది.అయితే ఈ ఖాళీ సమయంలో నాగ్ అశ్విన్ ఓ షార్ట్ వెబ్ ఫిలిం ప్లాన్ చేసుకున్నాడు.

నెట్ ఫ్లిక్స్ కోసం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో శృతి హాసన్ లీడ్ రోల్ లో ఓ వెబ్ షార్ట్ ఫిలింని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.హైద‌రాబాద్‌లోని సార‌థి స్టూడియోస్‌లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో షూటింగ్ కూడా మొద‌లుపెట్టారని సమాచారం.30 నిమిషాల నిడివి గల ఈ వెబ్ ఫిలింలో శృతిహాస‌న్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా వర్క్ అవుట్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube