ప్రభాస్ తో పాన్ వరల్డ్ కి టార్గెట్ పెట్టిన నాగ్ అశ్విన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా తన హవాని కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

 Nag Ashwin Plan Pan World Movie With Prabhas, Tollywood, Bollywood, Deepika Padu-TeluguStop.com

ఇక ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ఆయన ఇమేజ్ పెంచే విధంగానే ఉండబోతుంది.రామాయణం ఆధారంగా ఈ ఆది పురుష్ తెరకెక్కుతుంది.

అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కబోతుంది.ఈ సినిమాల మీద భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపధ్యంలో వాటిలో హిట్ బట్టి ప్రభాస్ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది.

ఇండియన్ వైడ్ గా పాపులారిటీ పెంచుకుంటున్న ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకులు సైతం భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అతనితో సినిమా చేసిన 200 కలెక్షన్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఉండటంతో పెద్ద పెద్ద దర్శకులు ప్రభాస్ తో సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు సినిమాల తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఇది సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

దీనిపై ఇప్పటికే సెట్స్ నిర్మాణం జరుగుతుంది.ఈ సినిమాలో సూపర్ హీరోగా ప్రభాస్ ని చూపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

అలాగే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ ని పాన్ వరల్డ్ రేంజ్ లో పెంచాలనే యోచనలో నాగ్ అశ్విన్ ఉన్నట్లు తెలుస్తుంది.

చైనా నుంచి ఇంటర్నేషనల్ హీరోలుగా ఉన్నా జాకీచాన్, జెట్ లీ తరహాలో ఇండియా నుంచి ప్రభాస్ ని ఎలివేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.దీనికోసం నాగ్ అశ్విన్ సినిమాని ఇండియన్ బాషలతో పాటు విదేశీ బాషలలో కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు బోగట్టా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube