ప్రభాస్ కోసం సరికొత్త ప్రపంచమే సృష్టిస్తున్న నాగ్ అశ్విన్

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి వరుస సినిమాలు చేస్తున్నాడు.అతని ప్రతి సినిమా సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

 Nag Ashwin Create New Word For Prabhas Movie-TeluguStop.com

ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న రాదేశ్యామ్ సినిమాగా, ఆది పురుష్ గాని సలార్ గాని దేనికవే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం.ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ జులైలో ప్రారంభం అవుతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.ప్రస్తుతం ఆది పురుష్ షూటింగ్ లో ప్రభాస్ ఉన్నాడు.

 Nag Ashwin Create New Word For Prabhas Movie-ప్రభాస్ కోసం సరికొత్త ప్రపంచమే సృష్టిస్తున్న నాగ్ అశ్విన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత సలార్ షూటింగ్ లో మళ్ళీ పాల్గొంటాడు.ఇక తాజాగా జాతి రత్నాలు మూవీ ప్రమోషన్ లో ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

ప్రభాస్ తో చేయబోయే సినిమా కోసం ఏకంగా రెండేళ్ళుగా ఖాళీగా ఉండాల్సి వచ్చింది.అయితే ఈ గ్యాప్ ప్రభాస్ కారణంగానే వచ్చింది.

మహానటి సినిమా పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కడం వలన దానికి కావాల్సినవి అన్ని ఎక్కడో ఓ చోట దొరికాయి.కాని ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఉపయోగించి ప్రతీదీ కొత్తగా సృష్టించుకోవాలి.

ఓ విధంగా చెప్పాలంటే ప్రభాస్ తో చేయబోయే సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని పూర్తిగా సృస్టించబోతున్నాం.దానికోసం చాలా వర్క్ చేస్తున్నాం అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

దీనిని బట్టి ఈ సినిమా కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఫ్యూచర్ స్టొరీ అని తెలుస్తుంది.భవిష్యత్తులోకి వెళ్లి ఈ సినిమా కథని నాగ్ అశ్విన్ చెప్పబోతున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చింది.

మరి ఈ కొత్త ప్రపంచంలో ప్రభాస్, దీపికా పదుకునేని నాగ్ అశ్విన్ ఎలా ప్రెజెంట్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Create New Word #Prabhas #Adi Purush #Nag Ashwin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు