ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, దుమ్ము రేపేలా లాభాలను దక్కించుకున్నాడు నాగార్జున.సోగ్గాడు ఇచ్చిన జోష్‌తో నాగార్జున మరింతగా దూసుకు పోవాలని నిర్ణయించుకున్నాడు.
త్వరలోనే ఈయన నటించిన ‘ఊపిరి’ చిత్రం విడుదల కాబోతుంది.ఆ సినిమా విడుదల కాకముందు నాగార్జున రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు.
ఆ రెండు సినిమాల్లో మొదటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఒక భక్తిరస చిత్రం తెరకెక్కబోతుంది.ఆ తర్వాత సోగ్గాడు దర్శకుడు కళ్యాణ్‌తో ‘బంగార్రాజు’ చిత్రం చేయనున్నాడు.
ఈ రెండు సినిమాలు కూడా ఇదే సంవత్సరంలో వచ్చేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేయబోతున్న భక్తి సినిమాను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయనున్నాడట.
రాఘవేంద్ర రావుకు ముందే రెండు నెలలు మాత్రమే అంటూ డేట్లు ఇచ్చాడని, అందుకోసం నాగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న నాగ్, రాఘవేంద్ర రావుల భక్తిరస ‘నమో వెంకటేశాయ’ చిత్రంను వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లి దసరా వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు.
స్క్రిఫ్ట్ పూర్తి అవ్వడంతో నటీ నటుల ఎంపిక జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాపై పూర్తి వివరాలను ఈనెలాఖరున మీడియాకు చెప్పనున్నారట.