నితిన్ సినిమాలో పవన్ అత్త.. ఏం చేస్తుందో?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల భీష్మ అనే సినిమాలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

 Nadhiya Key Role In Nithin Pan India Movie, Nithin, Power Peta, Krishna Chaitany-TeluguStop.com

ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో భీష్మ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ సాధించింది.ఇక తన నెక్ట్స్ చిత్రం ‘రంగ్ దే’ను ఇప్పటికే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయబోయే ‘పవర్ పేట’ సినిమాలో నితిని చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో నితిన్ మూడు పాత్రల్లో నటించనున్నాడు.కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ నటి నదియా నటించనున్నట్లు తెలుస్తోంది.గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో పవన్‌కు అత్తగా నటించిన నదియా, ఆ సినిమా సక్సెస్‌లో చాలా కీలక పాత్ర పోషించింది.ఆ తరువాత పలు సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ వస్తోన్న నదియా, నితిన్ నటించిన ‘అ ఆ’ చిత్రంలోనూ అత్త పాత్రలో నటించింది.

ఆ సినిమా నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

ఇప్పుడు మరోసారి నితిన్ చిత్రంలో నదియా నటిస్తుండటంతో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube