కాంగ్రెస్ కు మాజీ స్పీకర్ రాజీనామా ..? జనసేన వైపు అడుగులు     2018-10-11   13:22:16  IST  Sai M

ఏపీలో కాంగ్రెస్ వికెట్ మరొకటి పడింది. గత కొంతకాలంగా పార్టీకి ఆంటీ ముట్టనట్టుగా ఉన్న మాజీ స్పీకర్ ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ రాజీనామా చేశారు. నాదెండ్ల పార్టీనీ వీడే అంశంపై అనుచరులతో చర్చించారు. చివరికి జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేడు తిరుపతిలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. దీంతో జనసేన తరపున తెనాలి నుంచి మనోహర్ పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన మనోహర్.. రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. 2011లో స్పీకర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా ఎన్నికకాకముందు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో, అసెంబ్లీ కమిటీల్లో పనిచేశారు