జనసేనలో 'నాదెండ్ల' పెత్తనం పెరిగిందా...? వారి అసంతృప్తికి కారణం ఏంటి..?

జనసేన పార్టీలో అంతర్గతంగా నాయకుల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరు రోజు రోజుకి ముదిరిపోతోంది.పార్టీలో పవన్ తరువాత మేమే అన్నట్టుగా పవన్ కోటరీలో నాయకులు ఫీల్ అవుతున్నారు.

 Nadendla Manohar Plays Main Role In The Janasena Party-TeluguStop.com

కానీ వారికి ఆ స్థాయిలో ప్రాధాన్యం దక్కకపోవడంతో….లోలోపల అసహనంతో రగిలిపోతున్నారు.

ఈ సమయంలోనే పార్టీలోకి కొత్తగా వచ్చిన నాదెండ్ల మనోహర్ ప్రాధాన్యం రోజురోజుకి పెరిగిపోతుండటం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.పార్టీ పెట్టినప్పటినుంచి నిబద్ధతగా పనిచేస్తున్న తమను కాదని కొత్తగా చేరిన నాదెండ్ల మనోహర్ కి ఎలా ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ అసహనంతో రగిలిపోతున్నారు.

ఆయన రాక ముందు పార్టీలో అంతా తామే అన్నట్టుగా పవన్ తమకు ప్రాధాన్యం ఇచ్చాడని … కానీ నాదెండ్ల చేరిన తరువాత కనీసం తమకు మాట మాత్రం కూడా చెప్పకుండా ఎన్నో ఎన్నెన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.

పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్న నాదెండ్ల ప్రయారిటీని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ విషయంపై పవన్ తో నేరుగా చర్చించేందుకు సిద్ధమయ్యారు.పవన్ చేస్తున్న పోరాటయాత్రల్లో పాల్గొనకుండా తమ నిరసనను తెలియజేస్తూ పవన్ దృష్టికి తమ అసంతృప్తి చేరేలా ప్రయత్నిస్తున్నారు.

నాలుగేళ్ల నుంచి పవన్ పార్టీలో ఒక్కరే ఉన్నారు.నాలుగున్నరేళ్ల క్రితం జనసేన పార్టీని ప్రకటించినా ఆయన తప్ప పార్టీలో ఎవరూ లేరు.

తర్వాత మెల్లిగా చేరికలు మొదలయ్యాయి.పవన్ పొలిటికల్ స్పీడ్ కూడా పెంచడంతో… చేరికలు కూడా ఊపందుకున్నాయి.

ముందుగా పవన్ వెంట మాదాసు గంగాధరం, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, తోట చంద్రశేఖర్ వంటి నేతలు ఉన్నారు.వీరే పవన్ నడిపించేవారు.

అయితే వైసీపీలో చేరతారనుకున్న నాదెండ్ల మనోహర్ అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు.

చేరినప్పటి నుంచి నాదెండ్ల మనోహర్ కి పవన్ ఇస్తున్న ప్రాధాన్యం మిగతా నాయకులకు రుచించడంలేదు.అంతే కాదు.మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, రావెల కిశోర్ బాబులను చేర్చుకునే ముందు కూడా తమతో చర్చించలేదని ఈ నేతలు వాపోతున్నారు.

నాదెండ్ల మీద గుర్రుగా ఉన్నవారంతా … పవన్ సామజిక వర్గానికే చెందిన వారు కావడం గమనార్హం.అంతే కాకుండా ఇప్పటి వరకు పవన్ కి ఆర్ధికంగా అండదండగా ఉన్న వారంతా ఇలా ఒక్కసారిగా ప్రాధాన్యం కోల్పోవడంతో తమ భవిష్యత్తు ఏంటో నేరుగా పవన్ దగ్గరే తేల్చుకోవాలని చూస్తున్నారు.

ఇక ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా ప్రయోజనం ఉండదని వారిలో కొందరు భావిస్తున్నారు.పవన్ కనుక ఏదో ఒకటి తేల్చి తమకు క్లారిటీ ఇవ్వాలని వీరంతా భావిస్తున్నారు.

అయితే పార్టీలో నెలకొన్న ఈ అసంతృప్తి వ్యవహారం గురించి పవన్ కి తెలిసినా… అన్నీ అవే సర్దుకుంటాయిలే అనే భావనలో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube