ఆ వార్తల్లో నిజం లేదని చెప్పిన జనసేన కీలక నేత! పవన్ కళ్యాణ్ తోనే ఉంటా అని ప్రకటన  

జనసేన పార్టీ వీడటం లేదని చెప్పిన నాదెండ్ల మనోహర్. .

Nadendla Manohar Gives Clarity About Party Change-janasena,nadendla Manohar Gives Clarity,party Change,tdp,ysrcp

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసిన జనసేన అధినేత జగన్ ఊహించని విధంగా తాజా ఎన్నికలలో ఓటమి పాలయ్యాడు. కేవలం ఒక్క సీటుకి పరిమితం అయిపోయి ఊహించని దెబ్బ తిన్నాడు. దీంతో ఇప్పుడు జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో గెలుస్తామని భావించిన చాలా మంది నేతలు పార్టీని వీడెందుకు సిద్ధం అయిపోతున్నారు..

ఆ వార్తల్లో నిజం లేదని చెప్పిన జనసేన కీలక నేత! పవన్ కళ్యాణ్ తోనే ఉంటా అని ప్రకటన-Nadendla Manohar Gives Clarity About Party Change

ఇప్పటికే కోస్తా జిల్లాల నుంచి ఇద్దరు కీలక నేతలు జనసేనని వీడి వెళ్ళిపోయారు. తాజాగా మరో కీలక నేత రావెల కిషోర్ బాబు కూడా జనసేనకి రాజీనామా చేసారు. ఈ రోజు అధికారికంగా మోడీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరబోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు జనసేన లో పవన్ కళ్యాణ్, జేడీ లక్ష్మినారాయణ తర్వత ఆ స్థాయిలో చరిష్మా ఉన్న నాయకుడుగా నాదెండ్ల మనోహర్ కూడా పార్టీని వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారని టాక్ వినిపించింది. ఆయన వైసీపీలో వెళ్లబోతున్నారని, ముఖ్యమంత్రి జగన్ మనోహర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలలో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేసారు.

తాను ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం వలన సమీక్షలకి హాజరు కాలేకపోతున్నానని, ఇండియా రాగానే జనసేన పార్టీ సమీక్షలకి హాజరు అవుతా అని నాదెండ్ల స్పష్టం చేసారు. జనసేన పార్టీని వీడే ప్రసక్తే లేదని నాదెండ్ల చెప్పడంతో ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న పుకార్లకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.