పవన్ ఢిల్లీ పర్యటన అందుకు కాదా ? ఇందుకా ?  

Nadendla Manohar About Pawan Kalyan Delhi Tour-nadendla Manohar,pawan Kalyan Delhi Tour

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవడంపై ఏపీ రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు చెలరేగాయి.చంద్రబాబు తరఫున కేంద్ర బిజెపి పెద్దలతో మంతనాలు చేసేందుకే ఇంత హడావిడిగా పవన్ వెళ్లారని వైసిపి విమర్శలు చేసింది.అంతేకాదు ఢిల్లీ పర్యటనలో పవన్ అమిత్ షా తో భేటీ అవుతున్నారని, వీలైతే మోదీతో కూడా ఏపీ రాజకీయాల గురించి చర్చలు జరుపుతారని, ఈ సందర్భంగా తెలుగుదేశంతో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తారు అంటూ అనేక ఊహాగానాలు కూడా తెరమీదకు వచ్చాయి.ఈ తరహా ప్రచారాలు మరింత తీవ్రం కావడంతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ స్పందించారు తాము ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే ఢిల్లీకి వచ్చాము తప్ప ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు పెట్టుకోవడంలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.అయితే ఇదంతా కల్పితం అని బీజేపీ పెద్దలతో మంతనాలు చేసి వైసీపీని టార్గెట్ చేసుకునే విషయాన్ని చర్చించేందుకు మాత్రమే పవన్ వెళ్లారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Nadendla Manohar About Pawan Kalyan Delhi Tour-nadendla Manohar,pawan Kalyan Delhi Tour Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Nadendla Manohar About Pawan Kalyan Delhi Tour-Nadendla Tour