విలన్‌ను హీరోల, హీరోను విలన్‌లా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. ‘ఎన్టీఆర్‌’పై నాదెండ్ల ఆరోపణలు  

 • నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ బయోపిక్‌ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల విజయ భాస్కర్‌ గురించి ఉండబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దాంతో ఆయన విడుదల ముందు సినిమాపై వివాదాన్ని మొదలు పెట్టాడు.

 • Nadendla Bhaskara Rao About Film NTR Biopic-Ntr Biopic Ntr Movie Release Date Ntr Trols

  Nadendla Bhaskara Rao About Film NTR Biopic

 • ఎన్టీఆర్‌ రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయనకు పక్షవాతం వచ్చింది. ఆ సమయంలో లేవలేని స్థితిలో ఆయన ఉన్నారు. అప్పుడు ఆయన 12 మంది పిల్లల్లో ఏ ఒక్కరు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఆ సమయంలోనే లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇచ్చి ఆయన బాగోగులు చేసుకుంది.

 • Nadendla Bhaskara Rao About Film NTR Biopic-Ntr Biopic Ntr Movie Release Date Ntr Trols
 • అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను ముఖ్యమంత్రిగా కూడా ఎన్టీఆర్‌ చేస్తాడని చంద్రబాబు నాయుడు భావించాడు. ఆ కారణంగానే కుటుంబ సభ్యులందరితో కలిసి చంద్రబాబు నాయుడు కావాలని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు.

 • Nadendla Bhaskara Rao About Film NTR Biopic-Ntr Biopic Ntr Movie Release Date Ntr Trols
 • ‘ఎన్టీఆర్‌’ సినిమాలో చంద్రబాబు నాయుడు పెద్ద విలన్‌. కాని ఆయన్ను హీరోగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఎన్టీఆర్‌ను రాజకీయంగా నిలబెట్టాను. కాని నన్ను మాత్రం చెడుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలో హీరోలను విలన్‌లుగా, విలన్‌లను హీరోలుగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 • Nadendla Bhaskara Rao About Film NTR Biopic-Ntr Biopic Ntr Movie Release Date Ntr Trols
 • నా గురించి చిన్న తప్పుడు సీన్‌ ఉన్నా, నా పాత్ర ఉన్నా కూడా కఠినంగా వ్యవహరిస్తానంటూ నాదెండ్ల హెచ్చరించాడు. నాదెండ్ల హెచ్చరిక నేపథ్యంలో ఎన్టీఆర్‌ యూనిట్‌ సభ్యులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.