జూనియర్ ఎన్ఠీఆర్ వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటున్న నాదెండ్ల  

Nadendla Bhaskar Rao Comments On Junior Ntr-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు జూనియర్ ఎన్ఠీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడం తో పలువురు ఇక పార్టీ అస్తమించే ప్రమాదం ఉందని,కావున జూనియర్ ఎన్ఠీఆర్ మాత్రమే ఇక పార్టీ ని పైకి తీసుకువచ్చే అవకాశం ఉంది,ఆయనకు పార్టీ పగ్గాలు అందించాలి అంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరిన సంగతి తెలిసిందే.అయితే ఒకపక్క ఇలాంటి కామెంట్స్ వస్తున్న ఈ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్ఠీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి...

Nadendla Bhaskar Rao Comments On Junior Ntr--Nadendla Bhaskar Rao Comments On Junior NTR-

ఎన్ఠీఆర్ రాజకీయాల్లోకి రావాలన్న వార్తలు నేను కూడా విన్నాను, ఒకవేళ ఆయన వచ్చినా తెలుగుదేశం పార్టీని బతికించలేరు అంటూ జోస్యం చెప్పారు.జూనియర్ ఎన్ఠీఆర్ రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని,అసలు నాకు జూనియర్ ఎన్ఠీఆర్ ఎవరో కూడా తెలియదు అంటూ వ్యాఖ్యానించారు.అంతేకాకుండా నేను ఇప్పుడూ కూడా ఆయన సినిమాలు చూడనని అన్న ఆయన, ఎన్ఠీఆర్ పార్టీ లోకి వస్తేనే పూర్వ వైభవం వస్తుందో లేదో అన్న విషయం పై ఆయన కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.అలానే మరోపక్క ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన లో చేరడం పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

మనోహర్ జనసేన పార్టీ లో చేరడం ఒక తప్పిదం అన్నట్లుగా భాస్కర్ రావు వ్యాఖ్యానించారు..

Nadendla Bhaskar Rao Comments On Junior Ntr--Nadendla Bhaskar Rao Comments On Junior NTR-

ఇప్పటివరకు కూడా నేను ఎప్పుడూ జనసేన గురించి మాట్లాడలేదు,ఇప్పుడు కూడా ఆ పార్టీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోవడం లేదు, ఆ పార్టీ లో మనోహర్ ఉండాలా? లేదా? అన్న విషయం పై ఆలోచిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.ఇక, 2014లోనే తనకు బీజేపీ పార్టీ ఆహ్వానం ఇచ్చింది అని అయితే ఆ పార్టీ ఆదేశిస్తే మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ భాస్కర్ రావు స్పష్టం చేశారు.అలానే ఏపీ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కి ప్రత్యామ్నాయంగా ఒక్క బీజేపీ పార్టీ యే ఉందని, తప్పకుండా బీజేపీ ఏపీలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.