ఎన్టీఆర్ బయోఫిక్ : బాలకృష్ణకు లీగల్ నోటీసులిచ్చిన మాజీ సీఎం

ఎన్టీఆర్ బయోపిక్ ఇంకా విడుదల కాకముందే ఎన్నో వివాదాలకు, సస్పెన్స్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.ముందుగా ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ప్రారంభం అవ్వగా… ఆ తరువాత దర్శకుడు మారిపోయాడు.

 Nadendla Baskrarao Give Legal Notice To Balakrishna-TeluguStop.com

ఇక ఈ సినిమాకు కౌంటర్ గా అన్నట్టు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా… లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మరో బయోపిక్ మొదలుపెట్టి కాక రేపాడు.

తాజాగా… ఈ సినిమాకు సంబంధించి మరో వివాదం చెలరేగింది.ఈ సినిమా నిర్మిస్తున్న నందమూరి బాలకృష్ణకు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు నోటీసులు పంపించారు.ఎందుకంటే….ఇంతకీ విషయం ఏంటి అంటే… ఎన్టీఆర్ బయోపిక్ లో తనను విలన్ గా చూపితే కోర్టుకు వెళతానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించారు.తనతో ఇంతవరకు చిత్ర నిర్మాణ సంస్థ కు చెందినవారు ఎవరూ లేరని ఆయన అన్నారు.

రాజకీయ అవసరాల కోసం తనను విలన్ చూపించే ప్రయత్నాలు జరిగితే… ఊరుకోబోనని ఆయన అన్నారు.

తన పాత్రను నెగిటివ్ గా చుపిస్తున్నారనే సమాచారం వచ్చిందని అందుకే… ఆ చిత్ర యూనిట్ కు చెందినవారికి నోటీసులు పంపినట్లు ఆయన చెప్పారు.సినిమా హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ , సెన్సార్ బోర్డు సభ్యులకు నోటీసులు పంపించినట్లు భాస్కరరావు వివరించారు.టిడిపి పార్టీ పెట్టిందే నేను అంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube