నాలో వేరొక మనిషి ఉంది అంటున్న నభా నటేష్

టాలీవుడ్ లో ప్రస్తుతం కుర్ర హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న అందాల భామ నభా నటేష్.ఈ అమ్మడు ఇస్మార్త్ శంకర్ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటుంది.

 Nabha Natesh Told Inside I Am A Full Mass, Tollywood, Solo Brathuke So Better Mo-TeluguStop.com

ఇస్మార్ట్ మాంచి మాస హీరోయిన్ పాత్రలో అలరించడంతో పాటు అందాల ప్రదర్శనలో నిధి అగర్వాల్ కి సైతం పోటీ ఇచ్చింది.దీంతో కుర్ర హీరోలు అందరూ నాభా చుట్టూ తిరుగుతున్నారు.

లాక్ డౌన్ తర్వాత తాజాగా సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో ఈ అమ్మడు మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమాలో కూడా మంచి ఇంటరెస్టింగ్ రోల్ లో అమ్మడు సందడి చేసి ఆకట్టుకుంది.

ఇందులో కూడా కాస్తా మాస్ టచ్ ఉన్న పాత్రలోనే ఆడిపాడింది.

Telugu Alludu Adhurs, Boxer, Solo Brathuke, Tollywood-Movie

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలో ఆడిపాడింది.ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉండటంతో మరో హిట్ నభా నటేష్ ఖాతాలో వేసుకుంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే మరో వైపు వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో కూడా నభా నటేష్ హీరోయిన్ గా చేస్తుంది.ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.అది కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక మరో రెండు సినిమాల వరకు చర్చల దశలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే మాస్ రోల్స్ లో అలరిస్తున్న ఈ అమ్మడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ బయటకి నేను క్లాస్ గా కనిపించిన లోపల మాత్రం మాస్ ఉందని.తాను చిన్నప్పటి నుంచి తెలుగు కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగానని, వాటిమీద తనకి ప్రత్యేకమైన ఇష్టం ఉందని చెప్పింది.

ఈ కారణంగా కమర్షియల్ సినిమాలలో మాస్ రోల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్న అని పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube