తారక్ సినిమాలో ఇస్మార్ట్ పోరి.. మామూలుగా ఉండదంతే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

 Nabha Natesh To Romance Ntr, Nabha Natesh, Ntr, Tollywood News, Ntr30, Trivikram-TeluguStop.com

అయితే ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించాడు తారక్.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

కాగా ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.

తాజాగా ఈ సినిమాలోని తారక్ లుక్ టెస్ట్‌ను కూడా నిర్వహించాడు.అయితే తారక్ సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా అనే అంశంపై చిత్ర యూనిట్ సుదీర్ఘంగా ఆలోచించింది.

కాగా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్‌తో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నభా నటేష్‌ను తారక్ సరసన హీరోయిన్‌గా తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.

అమ్మడి అందంతో పాటు అభినయం కూడా ఆయనకు బాగా నచ్చడంతో ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలని త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో తారక్ రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఈ సినిమాను రాధాకృష్ణతో పాటు కళ్యాణ్ రామ్ కలిసి ప్రొడ్యూస్ చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube