మాస్ట్రోపై ఇస్మార్ట్ బ్యూటీ ఓవర్ కాన్ఫిడెన్స్.. సినిమా హిట్ అవుతుందా ?

కన్నడ, తెలుగు నటి నభా నటేష్.విభిన్న పాత్రలతో.తన అందంతో అభిమానులను అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.2019 లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ విజయవంతమవడంతో.తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందనే చెప్పాలి.

 Nabha Natesh Talk About Nithiin Matram Movie Maestro, Nabha Natesh, Nithiin,isma-TeluguStop.com

ఇక వివరాల్లోకి వెళితే.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్స్ లో గడుపుతున్న నభా నటాషా. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో నితిన్ హీరోగా, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో.

ఇది అంధాదున్ అనే హిందీ సినిమాకి రీమేక్.బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన ఈ సినిమాలో తనకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

Telugu Ismart, Maestro, Nabha Natesh, Nithiin, Nithin, Tamannah, Tollywood-Movie

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని.చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.ఈ సినిమాను తీశానని నభా నటేశ్ చెప్పుకొచ్చారు.అంధుడిగా నితిన్ బాగా నటించారని రీమేక్ అయినప్పటికీ.కథలో చాలా మార్పులు చేశారని ఆమె అన్నారు.దీన్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు ఆమె తెలిపారు.

Telugu Ismart, Maestro, Nabha Natesh, Nithiin, Nithin, Tamannah, Tollywood-Movie

ఇక తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ వారు ఎప్పుడూ పాతదనంతో పాటు కొత్తదనాన్ని కూడా కోరుకుంటారని.నభా నటేశ్ అన్నారు.నటుడు నితిన్ తో పని చేయడం ఎంతో సరదాగా అనిపించిందని.చిత్ర యూనిట్ తో పాటు.తమన్నా కూడా బాగా సహకరించారని ఆమె తెలిపారు.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడేమీ చెప్పలేనని .కానీ ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించడం హ్యాపీగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.మాస్ట్రో సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తానన్న నభా నటేష్మూవీ చూశాక ప్రజలు కూడా అదే అంటారని ఆమె అత్యుత్సాహం ప్రదర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube