దూసుకొస్తున్న నభా నటేష్.. వాళ్ళకి పోటీ ఇస్తుందా  

Nabha Natesh Speed Up Her Movies In Tollywood - Telugu Celebrities, Heroins,, South Cinema, Telugu Cinema

టాలీవుడ్ లో హీరోయిన్ గా నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి మార్కులు కొట్టేసిన భామ నభా నటేష్.కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్ అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు మొదటి సినిమాతో క్యూట్ గర్ల్ ఇమేజ్ సొంతం చేసుకుంటే రెండో సినిమా ఇస్మార్ట్ శంకర్ తో పూర్తిగా పూరీ భామగా మారిపోయి హాట్ అందాలు ఆరబోసింది.

 Nabha Natesh Speed Up Her Movies In Tollywood

దీంతో ఈ అమ్మడు మీద టాలీవుడ్ దర్శకుల ఫోకస్ పడింది.దీంతో అనుకున్నట్లుగానే అవకాశాలు ఈ అమ్మడుని వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఇస్మార్ట్ తర్వాత డిస్కో రాజా సినిమాలో రవితేజతో జత కట్టిన ఈ అమ్మడుకి ఆ సినిమా డిజాస్టర్ అందించింది.

దూసుకొస్తున్న నభా నటేష్.. వాళ్ళకి పోటీ ఇస్తుందా-Movie-Telugu Tollywood Photo Image

అయిన కూడా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటరు, బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలు చేస్తుంది.

ఈ రెండు సినిమాలు కమర్షియల్ జోనర్ లోనే తెరకేక్కుతున్నాయి.మళ్ళీ రవితేజ కి జోడీగా రమేష్ వర్మ సినిమాలో నభా నటేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.

ఈ ఏడాది రిలీజ్ కి రెడీగా ఉన్న రెండు సినిమాలు హిట్ అయితే నభా కూడా కమర్షియల్ హీరోయిన్ గా మారిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.అదే జరిగితే పూజా హెగ్డే, రష్మిక మందన స్థానంలోకి ఈ భామ కూడా వచ్చేసే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nabha Natesh Speed Up Her Movies In Tollywood Related Telugu News,Photos/Pics,Images..

footer-test