నభా నటేష్ కు యాక్సిడెంట్.. ఈ న్యూస్ విని ఫ్యాన్స్ అంతా షాక్!

సినీ ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచం.ఇందులోకి ఇక్కసారి ఇరుక్కుంటే అంత త్వరగా బయటకు రాలేము.

 Nabha Natesh Reveals She Had Multiple Surgeries Details, Nabha Natesh, Tollywood-TeluguStop.com

అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పుకోవాలి.వీరి కెరీర్ టైం అంత లాంగ్ గా ఉండదు.

హీరోయిన్లు కొంత కాలానికే కెరీర్ ముగించాల్సిందే.ఇక కొంత మంది మాత్రం కెరీర్ లో ఎంత ఫాస్ట్ గా హిట్స్ అందుకుని అవకాశాలు దక్కించు కుంటున్నారో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో త్వరగా పాపులర్ అయ్యి ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని మళ్ళీ త్వరగా ఫేడ్ అవుట్ అయిన ముద్దుగుమ్మలు ఎవరు అనగానే ఈమె పేరు వినిపిస్తుంది.ఆమెనే నభా నటేష్.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న నభా నటేష్ ఆ తర్వాత చేసిన సినిమాలతో మాత్రం అలంటి హిట్ అందుకోలేక పోతుంది.

ఇష్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అయితే అందుకుంది.కానీ మరో హిట్ అందుకోలేక పోయింది.నభా నటేష్ అందం, అభినయంలో మిగతా ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తీసిపోదు.

అయితే ఈమెకు హిట్ లేకనే కష్టపడుతుంది.ప్రెజెంట్ అడపాదడపా అవకాశాలు అయితే అందుకుంటుంది.

ఇదిలా ఉండగా ఈమె తాజాగా ఒక షాకింగ్ న్యూస్ షేర్ చేసింది.ఈమెకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి ఆమె ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.”నేను అందరిని బాగా మిస్ అయ్యానని.అయితే లాస్ట్ ఇయర్ లోనే యాక్సిడెంట్ అవ్వడంతో ఎడమ చేతి భుజం దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది అని అక్కడ ఎముకలు విరగడంతో చాలా సర్జరీలు చేయించు కోవాల్సి వచ్చింది అని దీనివల్ల సినిమాలకు కూడా బ్రేక్ వచ్చింది అని తాను ఇప్పుడు కోలుకోవడంతో ఈ వార్త మీతో షేర్ చేసుకుంటున్నాను” అంటూ ఈమె పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ తో ఆమె ఫ్యాన్స్ ముందు ఆందోళన చెందిన ఈమె కోలుకోవడంతో ఊపిరి పీల్చు కుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube