రౌడీతో ఇస్మార్ట్‌ పోరి రొమాన్స్‌

విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం విడుదలైన వెంటనే పూరి దర్శకత్వంలో ‘ఫైటర్‌’ మూవీని విజయ్‌ దేవరకొండ చేయబోతున్నాడు.

 Nabha Natesh Inpurijaganth Movie-TeluguStop.com

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండకు సరిపోయే మంచి స్క్రిప్ట్‌ను దర్శకుడు బ్యాంకాక్‌ బీచ్‌ల్లో కూర్చుని ఎంజాయ్‌ చేస్తూ సిద్దం చేస్తున్నాడు.స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన తర్వాత ఇండియాకు తిరిగి రానున్న పూరి ఈ ఏడాది చివర్లో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

Telugu Ismart Shanker, Nabha Natesh, Nabhanatesh-

  ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన ముద్దుగుమ్మ నభా నటేష్‌ను తన తదుపరి చిత్రంలో కూడా కంటిన్యూ చేయాలని పూరి భావిస్తున్నాడు.అందుకు విజయ్‌ దేవరకొండ నుండి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.ఆ సినిమాలో ఆమె చెప్పిన మాస్‌ డైలాగ్స్‌ మరియు మాస్‌ బాడీలాంగ్వేజ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అందుకే ఈ చిత్రంలో కూడా ఆమెనే నటింపజేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Ismart Shanker, Nabha Natesh, Nabhanatesh-

  నభానటేష్‌కు ఇస్మార్ట్‌ శంకర్‌తో మంచి ఫేం వచ్చింది.ఆ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు చేసే అవకాశాలు దక్కించుకుంది.ఇప్పటికే రవితేజతో పాటు మరో యంగ్‌ హీరో చిత్రంలో నటిస్తున్న ఈమె మరి కొన్ని చిత్రాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.మరో వైపు తమిళంలో కూడా ఈమెకు ఛాన్స్‌లు వస్తున్నాయి.

ఇంత క్రేజీ హీరోయిన్‌ కనుక విజయ్‌ దేవరకొండ సినిమాకు తప్పకుండా ప్లస్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube