అవకాశాలు లేక ఈ పరిస్థితికి దిగజారిన నభా నటేష్.. వైరల్ స్టోరీ?

పాపం.కొత్త హీరోయిన్ల రాకతో చిన్న హీరోయిన్లను పట్టించుకోవడం లేదు దర్శకనిర్మాతలు.

 Nabha Natesh Got Into This Situation Because Of No Opportunities Viral Story ,-TeluguStop.com

ఎంత గ్లామర్ షోస్ చేసినప్పటికీ కూడా వాళ్లకు అవకాశాలు లేకుండా పోతున్నాయి.అయినా కూడా చిన్నచిన్న హీరోయిన్లు ఏదో ఒకటి వచ్చిన దానితోనే సరిపెట్టుకోవాలి అన్నట్లుగా సెకండ్ హీరోయిన్ గా, లేదా చిన్న చిన్న పాత్రలలో చేయటానికి కూడా సిద్ధపడుతున్నారు.

ఇక డబ్బు కోసం తప్పనిసరిల అడ్వటైజ్మెంట్ లు కూడా చేస్తున్నారు.

ఎలాగో అలా తమ కెరీర్ ను ముందుకు నడిపించాలి అని వచ్చిన ప్రతి దానికి సై అంటున్నారు.

ఇక కొంతమంది హీరోయిన్లు తమ కేరిర్ అప్పుడే ముగిసింది అనుకొని సినిమాలకు గుడ్ బై చెబుతూ చిన్న చిన్న బిజినెస్ లు చేస్తున్నారు.కానీ మరి కొంతమంది హీరోయిన్లు ఎక్కడో ఒక చిన్న ఆశ కొద్ది ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.

అలాంటి వారిలో నబా నటేష్ ఒకరు.

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ నభా నటేష్.

చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంది.నటన పరంగా కూడా బాగానే మార్కులు సంపాదించుకుంది కానీ.

ఎందుకో అంత ముందుకు కదలట్లేదు.మొదట మోడలింగ్ రంగంలో పనిచేసిన ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత ఆ హోదాతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

అలా తొలిసారిగా 2015 కన్నడం లో వజ్రకాయ అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయమైంది.అలా ఏదో కొంతవరకు నటనపరంగా మార్కులు సంపాదించుకుంది.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా అందరిని బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించగా అంతగా ఆ సినిమా సక్సెస్ కాలేక పోయింది.

ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ అవకాశాల కోసం బాగా కష్టపడుతుంది.సోషల్ మీడియా వేదికను ఎంచుకొని ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూనే ఉంది.మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం బాగా వర్క్ అవుట్ లు కూడా చేస్తుంది.కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ బ్యూటీపై అస్సలు దృష్టి పెట్టట్లేదు.అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా.హాట్ హాట్ లుక్ లతో పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి దృష్టిలో పడుతుంది.

కానీ దర్శక నిర్మాతల దృష్టిలో మాత్రం పడలేక పోతుంది.ఇదంతా పక్కన పెడితే డబ్బు కోసం అడ్వర్టైజ్మెంట్లలో కూడా చేస్తుంది.ఏం చేస్తాం.సినిమాలు లేనప్పుడు.అవే మనకు తిండి పెట్టేవి కదా అన్నట్లుగా.వచ్చిన బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ గురించి కూడా ప్రమోట్ చేస్తుంది.

తాజాగా ఓ ఆన్లైన్ గేమ్ గురించి ప్రమోట్ చేయటంతో.ఆ వీడియో చూసి తన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

అవకాశాలు లేక ఇటువంటి బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నావా అంటూ బాధపడుతున్నారు.ఇక ఆమె తన స్టోరీ రూపంలో ఆ బెట్టింగ్ యాప్ గురించి చెప్పగా.

ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

https://instagram.com/stories/nabhanatesh/3050989143672179114?igshid=OWEyOTRmYTI=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube