ఒక్క సినిమాకే చుక్కలు చూపిస్తున్న బ్యూటీ

ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే అందులో నటించిన నటీనటులకు ఎలాంటి క్రేజ్ ఏర్పడుతుందో మనం చాలాసార్లు చూశాం.ముఖ్యంగా హీరోహీరోయిన్లకు వచ్చే క్రేజ్ వారికి ఓవర్‌నైట్‌‌లో గుర్తింపును తీసుకొచ్చి పెడుతుంది.

 Nabha Natesh Demands Huge Remuneration-TeluguStop.com

ఇలాగే ఒక్క సినిమాతో తెలుగులో గుర్తింపు సాదించిన బ్యూటీల్లో నభా నటేష్ కూడా ఒకరు.

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన నభా నటేష్‌కు మంచి గుర్తింపు వచ్చింది.ఆమె నటనతో పాటు అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.ఇప్పుడు రవితేజ నటిస్తున్న డిస్కో రాజా చిత్రంలో నటిస్తోన్న ఈ బ్యూటీ నిర్మాతలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది.

ఒక్క సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది ఈ పాప.ప్రస్తుతం నభా నటేష్‌కు క్రేజ్ ఉండటంతో ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.కాగా ఆమె తన రెమ్యునరేషన్ ఏకంగా రూ.80 లక్షలు అని చెప్పడంతో వారు అవాక్కవుతున్నారు.ఒక్క సినిమా హిట్ కావడంతో ఇంత మొత్తంగా రెమ్యునరేషన్‌ పెంచేయడం సరికాదని కొందరు అంటున్నారు.

కాగా మరికొందరు ఆమెను ఎలాగైన తమ సినిమాల్లో నటింపజేయాలని అడిగిన మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube