మాస్ రాజ ఎనర్జీ బూస్టింగ్... డిస్కో రాజా టీజర్  

Mass Maharaj Raviteja New Movie Disco Raja Teaser Out - Telugu Disco Raja Teaser Out, Mass Maharaj Raviteja, New Movie, South Cinema, Tollywood

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిస్కో రాజా.ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ రవితేజ తన మునుపటి గ్రేస్, ఎనర్జీ మళ్ళీ చూపిస్తూ, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాతో రాబోతున్నాడు.

Mass Maharaj Raviteja New Movie Disco Raja Teaser Out

ఇక ఇందులో రవితేజకి జోడీగా నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు.ఇక ఇందులో విలన్ గా సౌత్ లో నటుడుగా తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్న బాబీ సింహ నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

టైం ట్రావెల్ మూవీ అని భావించిన ఈ సినిమాలో దర్శకుడు ఓ డిఫరెంట్ పాయింట్ ని చూపించాబోతున్నట్లు ప్రెజెంటేషన్ చూస్తుంటే అర్ధమవుతుంది.

ఇక ఇందులో బాబీ సింహని ఒక పవర్ ఫుల్ వయసు మళ్ళిన విలన్ గా ఆవిష్కరించాడు.ఇక రవితేజ తన స్టైల్ లో కొత్త లుక్ తో కనిపిస్తూనే కామెడీ యాక్షన్ తో అలరించాడు.

ఒక మిషన్ కోసం బయలుదేరిన రవితేజ దానిని ఎలా చేజ్ చేశాడు అనే ఎలిమెంట్ ని ఇందులో చూపించాబోతుననాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిట్రో మ్యూజిక్ తో వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

ఈ నేపధ్యంలో తాజాగా సినిమా కంటెంట్ ని ఎలివేట్ చేస్తూ హీరో, విలన్ మధ్య వార్ ని ప్రెజెంట్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mass Maharaj Raviteja New Movie Disco Raja Teaser Out Related Telugu News,Photos/Pics,Images..

footer-test