స‌రికొత్త రికార్డ్ సృష్టించిన నాటు నాటు సాంగ్?

Naatu Naatu Song Creat A New Record

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు.

 Naatu Naatu Song Creat A New Record-TeluguStop.com

ఈ క్రమంలోనే గత వారం రోజుల క్రితం విడుదలైన నాటు నాటు అనే పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోందని చెప్పవచ్చు.ఈ పాటలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.

ఇదిలా ఉండగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ పాట కూడా సృష్టించని సరికొత్త రికార్డును నాటు నాటు సాంగ్ సృష్టించిందని చెప్పవచ్చు.ఈ పాట విడుదలైన మూడు వారాలలో యూట్యూబ్ లో మిలియన్ లైక్స్ దక్కించుకొని దూసుకుపోతుంది.

 Naatu Naatu Song Creat A New Record-స‌రికొత్త రికార్డ్ సృష్టించిన నాటు నాటు సాంగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇందులో ఎన్టీఆర్ ,చరణ్ వేసిన స్టెప్పులను ఎంతోమంది అభిమానులు వేస్తూ వారు చేసిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఈ పాట అద్భుతమైన రికార్డులను సృష్టించింది.ఇక ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా ,చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

#Jr NTR #Ram Charn #Satu Satu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube