రాజమౌళి తెరకెక్కించిన RRR ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించుకోవడమే కాదు, ఆ సినిమా కోసం పని చేసిన నటులు మరియు సాంకేతిక నిపుణులకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటుకు ఆస్కార్(Oscar) రావడంతో ఆస్కార్ అవార్డును అందుకున్నటువంటి చిత్ర బృందం ఒక్కొక్కరుగా తిరిగి ఇండియాకు చేరుకుంటున్నారు ఇప్పటికే రాజమౌళి కీరవాణి కుటుంబం మొత్తం ఇండియా రాగా తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్(RahulSipligunj) కూడా హైదరాబాద్ చేరుకున్నారు.ఇలా హైదరాబాద్ ( Hyderabad ) చేరుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున తనకు స్వాగతం పలికారు.
అభిమానులు సింగర్ రాహుల్ ను గజమాలతో సత్కరించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే తాను పాడిన పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడినటువంటి రాహుల్ ప్రతి ఆర్టిస్ట్ కి ఆస్కార్ వేదిక ఎక్కడ అనేది వారి కలగా ఉంటుంది.
అయితే నాకు మాత్రం రాజమౌళి(Rajamouli) కీరవాణి (Keeravani)గారి వల్ల ఆ అవకాశం దక్కిందని ఈయన సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గల్లీలో పుట్టి ఆస్కార్ స్టేజి పై పర్ఫార్మెన్స్ ఇస్తాను అని ఎప్పుడు అనుకోలేదు.పాట పడిన తరువాత ఆస్కార్ వేడుకలో ఉన్నవారు అంతా నిలబడి చప్పట్లు కొట్టారు.అంతకుమించి ఆనందం ఇంకేమి ఉంటుంది.
ఇలా నేను పాడిన పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తన తల్లి ఎంతో సంతోషం వ్యక్తం చేసిందని రాహుల్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇక ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన నటులు ఎన్టీఆర్(NTR) రామ్ చరణ్ (Ram Charan) గురించి కూడా పలు విషయాలను తెలియచేశారు వీరిద్దరూ స్టార్ హీరోలైనప్పటికీ డౌన్ టు ఎర్త్ ఉంటారని అనుకోలేదు.అమెరికాలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు తనని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారని ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి తెలిపారు.