రిలీజ్‌కు రెడీ అప్ప అంటోన్న నారప్ప  

Naarappa Starts Editing And Ready For Release - Telugu Asuran Remake, Naarappa, Srikanth Addala, Venkatesh

తమిళంలో యంగ్ హీరో ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ అసురన్ అక్కడ ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో ధనుష్ పాత్రకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 Naarappa Starts Editing And Ready For Release

ఇక ఈ సినిమాను తెలుగులో నారప్ప అనే టైటిల్‌తో రీమేక్ చేసేందుకు విక్టరీ వెంకటేష్ ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

అయితే ఎవ్వరి ఊహలకు అందకుండా ఈ సనిమా షూటింగ్ చివరిదశకు చేరినట్లు, అలాగే ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపులు ఉండంతో ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు వెంకీ మామ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

రిలీజ్‌కు రెడీ అప్ప అంటోన్న నారప్ప-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఇంత త్వరగా సినిమా షూటింగ్ ఎలా ముగించాడా అంటూ అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఏదేమైనా ఇలాంటి ఫీట్‌లు చేయడం వెంకీకే సాధ్యం అని ఆయన అభిమానులు అంటున్నారు.

ఇక పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తుండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియమణి నటిస్తోంది.మరి నారప్ప అసురన్ వంటి సక్సెస్‌ను అందుకుంటుందో లేదో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఏదేమైనా నారప్ప స్పీడుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test