నవంబర్ 5న ముహూర్తం పెట్టుకున్న నారప్ప  

Naarappa Movie Starts Shooting From November 5, Naarappa, Venkatesh, Shooting, Chiranjeevi, Balakrishna - Telugu Balakrishna, Chiranjeevi, Naarappa, Shooting, Venkatesh

టాలీవుడ్‌లో కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.చిన్న సినిమాలు మొదలుకొని భారీ బడ్జెట్ చిత్రాల వరకు తిరిగి షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

TeluguStop.com - Naarappa Movie Starts Shooting From November 5

కాగా ఇప్పటికే ఈ జాబితాలో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్స్ ఇప్పటికే తమ సినిమా షూటింగ్‌లు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తుండగా, తాజాగా మరో సీనియర్ హీరో కూడా తన సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు.

వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

TeluguStop.com - నవంబర్ 5న ముహూర్తం పెట్టుకున్న నారప్ప-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు వెంకీ రెడీ అవుతున్నాడు.కాగా బ్రహ్మోత్సవం వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాన్ని అందించిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో తిరిగి సక్సెస్ కొట్టాలని కసిగా చూస్తున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ 5న తిరిగి ప్రారంభించేందుకు వెంకీ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో వెంకటేష్ మాస్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది.ప్రస్తుతం కరోనా వ్యాప్తిని ఆపే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు నారప్ప అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి ఈసారైనా అనుకున్న సమయానికి నారప్ప షూటింగ్ మొదలుపెడతాడా లేడా అనే అంశంతో పాటు ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీతో ఉన్నారో అనేది కూడా చూడాలి.

#Naarappa #Balakrishna #Shooting #Venkatesh #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naarappa Movie Starts Shooting From November 5 Related Telugu News,Photos/Pics,Images..