ఫ్యామిలీతో దిగిపోయిన నారప్ప  

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’కు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు.ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తుండటంతో నారప్ప ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - Naarappa Family Poster Impressive

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.కాగా ఈ సినిమాతో వెంకీ మరోసారి తనదైన మార్క్ క్రియేట్ చేయడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు.ఇప్పటివరకు ఈ సినిమాలోని యాక్టర్స్‌కు సంబంధించి వేరువేరు పోస్టర్స్ వస్తూ ఉన్నాయి.

TeluguStop.com - ఫ్యామిలీతో దిగిపోయిన నారప్ప-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఇప్పుడు నారప్ప అండ్ ఫ్యామిలీ అనేలా పూర్తి కుటుంబంతో వెంకటేష్ దిగిపోయాడు.నారప్పగా వెంకటేష్, ఆయన భార్య సుందరమ్మగా ప్రియమణి, పెద్దకొడుకు మునికన్నాగా కార్తీక్‌లతో పాటు చిన్నకొడుకు, కూతురు కూడా ఈ పోస్టర్స్‌లో మనకు కనిపిస్తున్నారు.

మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఫ్యామిలీ ఫోటోను నారప్ప చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం విశేషం.

ఏదేమైనా నారప్ప చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే ధీమా చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాతో తన గుర్తింపును తిరిగి పొందేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ సినిమాను సురేష్ బాబుతో పాటు కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో వెంకటేష్ పర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందిన చిత్ర యూనిట్ అంటోంది.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.మరి నారప్ప ఎలాంటి విజాయాన్ని అందుకుంటాడో తెలియాలంటే వేసవి వరకు ఆగాల్సిందే.

#Venkatesh #Naarappa #Priyamani #Asuran Remake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naarappa Family Poster Impressive Related Telugu News,Photos/Pics,Images..