నాంది రీమేక్, డిజిటల్ హక్కులు అన్ని కోట్లా..?

దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత అల్లరి నరేష్ కు నాంది సినిమాతో భారీ సక్సెస్ దక్కింది.విజయ్ కనకమేడల కొత్త దర్శకుడే అయినా నరేష్ ను భిన్నమైన పాత్రలో చూపించడంతో పాటు ప్రేక్షకులు ఆ పాత్రను మెచ్చే విధంగా తెరకెక్కించారు.

 Naandi Movie Remake Digital Rights Details-TeluguStop.com

విజయ్ కనకమేడల తరువాత సినిమా కూడా నరేష్ హీరోగా తెరకెక్కబోతూ ఉండటం గమనార్హం.ఇప్పటికే నాంది సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు నిర్మాతకు భారీ లాభాలను అందిస్తోంది.

నాంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా రీమేక్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.నాంది రీమేక్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.ఆహా 2.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాంది డిజిటల్ హక్కులను తీసుకున్నట్టు తెలుస్తోంది.నాంది హిట్ కావడంతో అల్లరి నరేష్ సైతం వైవిధ్యమైన పాత్రలపై ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

 Naandi Movie Remake Digital Rights Details-నాంది రీమేక్, డిజిటల్ హక్కులు అన్ని కోట్లా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా శాటిలైట్ హక్కులకు సంబంధించిన వివరాలు తెలియల్సి ఉంది.నాంది భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయినా అల్లరి నరేష్ కెరీర్ కు ప్లస్ అయిందనే చెప్పాలి.నరేష్ ఇకపై నటించబోయే సినిమా కథ, కథనం విషయంలో విషయంలో జాగ్రత్తలు వహిస్తే మళ్లీ నటుడిగా వరుస ఆఫర్లతో బిజీ అవ్వడం ఖాయం.

కామెడీ పాత్రలతోనే కాదు సీరియస్ పాత్రలతోనూ మెప్పించగల నటుడిగా నరేష్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఇకపై నరేష్ ఎలాంటి పాత్రలను ఎంపిక చేసుకుంటారో చూడాల్సి ఉంది.

అల్లరి నరేష్ సినిమాలు తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న నేపథ్యంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం నరేష్ తో సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు.

#NaandiMovie #Aaha #Naandhi #Dil Raju #NaandiMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు