ట్రాజెడీగా ముగుస్తున్న నాంది

కామెడీ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్, ప్రస్తుతం సీరియస్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా ఆయన నాంది అనే సినిమాలో నటిస్తున్నాడు.

 Naandhi To Have A Sad Ending, Naandhi, Allari Naresh, Varalaxmi Sarath Kumar, Cl-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, రీసెంట్‌గా వచ్చిన టీజర్ అంచనాలు రెట్టింపు చేసింది.ఈ సినిమాతో అల్లరి నరేష్ గతంలో నటించిన గమ్యం, శంభో శివ శంభో లాంటి సక్సెస్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ చేస్తున్న పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఓ నిర్దోషికి పోలీసు స్టేషన్‌లో జరిగే అన్యాయం గురించి ఈ సినిమాలో మనకు చూపించనున్నారు.

ఇందులో భాగంగా అతడికి అక్కడ ఎదురయ్యే పరిస్థితులు, అతడిని పోలీసు అధికారులు ఏ విధంగా చిత్ర హింసలకు గురిచేస్తారనే అంశాలను మనకు కళ్లకు కట్టే విధంగా ఈ సినిమాలో దర్శకుడు విజయ్ కనకమేడల చూపించనున్నాడు.అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
న్యాయం కోసం ఎదురుచూసే వ్యక్తి పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్, ఈ సినిమా క్లైమాక్స్‌లో చనిపోతాడని తెలుస్తోంది.అతడు చనిపోయే సీన్‌కు ప్రేక్షకులు కంటతడి పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి నాంది చిత్రం సీరియస్ మూవీగా మాత్రమే కాకుండా ఎమోషనల్ కంటెంట్ పుష్కలంగా ఉన్న చిత్రంగా ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో లాయర్ పాత్రలో విజయలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచానలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube