నాంది చిత్రంతో అల్లరోడు కూడా అదే బాటలో?  

Naandhi Movie To Have OTT Release, Naandhi, OTT, Allari Naresh, Tollywood News - Telugu Allari Naresh, Naandhi, Ott, Tollywood News

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్, ఇప్పటికే వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.ఇక ఈ హీరో కామెడీ జోనర్ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

TeluguStop.com - Naandhi Movie To Have Ott Release

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే కొంతకాలానికి వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలతో ఫేడవుట్ అవుతూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు.

TeluguStop.com - నాంది చిత్రంతో అల్లరోడు కూడా అదే బాటలో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక అల్లరి నరేష్ నటిస్తు్న్న తాజా చిత్రం నాంది, ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకుంది.

కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ చాలా సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో, నాంది చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.కాగా ఇప్పుడు ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా జీ5 నాంది చిత్ర హక్కులను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీంతో ఈ సినిమాను త్వరలోనే జీ5 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక లేడీ విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తోంది.ఆమె నటన ఈ సినిమాకు అదనపు బలం కానుంది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Naandhi #Allari Naresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naandhi Movie To Have Ott Release Related Telugu News,Photos/Pics,Images..