టీజర్‌కు నాంది పలికిన అల్లరోడు!

టాలీవుడ్‌లో అల్లరి నరేష్ కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.కెరీర్ ఆరంభంలో వరుసబెట్టి కామెడీ చిత్రాలతో దూసుకుపోయిన ఈ హీరో, ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాడు.

 Naandhi Movie Teaser Date Fixed, Naandhi, Allari Naresh, Teaser, Tollywood News-TeluguStop.com

ఒక విధంగా ఫేడవుట్ అయిన ఈ హీరో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంతో క్యారెక్టర్ పాత్రల్లోకి వెళ్లిపోయాడు.కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఇప్పుడు నాంది అనే వైవిధ్యమైన సినిమాతో మనముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది.అల్లరి నరేష్ రొటీన్ సినిమాలకు ఇది పూర్తి వైవిధ్యంగా ఉండబోతుందనే విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.జూన్ 30న నాంది చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ మేరకు మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో పూర్తి నగ్నంగా కూర్చున్న పోస్టర్‌ను రివీల్ చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక సీరియస్ మూవీ అని తెలుస్తోంది.మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ సక్సెస్ అందుకుంటాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.మరి నాంది టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube