పోలీసులకు ఎసరుపెట్టిన నాంది  

Naandhi Movie To Show Police Cruelty, Naandhi, Allari Naresh, Vijay Kanakamedala, Varalaxmi Sarath Kumar - Telugu Allari Naresh, Naandhi, Varalaxmi Sarath Kumar, Vijay Kanakamedala

టాలీవుడ్‌లో రిలీజ్‌కు రెడీగా ఉన్న చిత్రాల్లో అల్లరి నరేష్ నటిస్తున్న ‘నాంది’ చిత్రం కూడా ఉంది.ఈ సినిమాతో మరోసారి అల్లరి నరేష్ తనదైన ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

 Naandhi Allari Naresh Varalaxmi Sarath Kumar

ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న అల్లరి నరేష్, ఈ సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఇక పూర్తి సీరియస్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథ చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ చిత్రంపై అంచనాలను పెంచేశాయి.ఓ ఖైదీకి జరిగే అన్యాయం, పోలీసులు అతడిపై చూపించే పైశాచికత్వం వంటి అంశాలను ఈ సినిమాలో ప్రేక్షకులకు చూపించనున్నారు.

పోలీసులకు ఎసరుపెట్టిన నాంది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా కస్టడీలో ఉన్న నిందితుల పట్ల పోలీసుల తీరును ఈ సినిమాలో ఎండగడతామని చిత్ర యూనిట్ అంటోంది.ఇలాంటి సీరియస్ కథతో తనకు మంచి గుర్తింపు వస్తుందని చిత్ర హీరో అంటున్నాడు.

తన కెరీర్‌కు ఈ సినిమా మంచి బూస్ట్ కానుందని ఆయన ఆశిస్తున్నాడు.

విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక మరో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోందని, ఆమె పాత్ర సినిమాకు చాలా బలం చేకూరుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ పోలీసుల గురించి ఎలాంటి నిజాలను చూపిస్తాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Naandhi #Allari Naresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naandhi Allari Naresh Varalaxmi Sarath Kumar Related Telugu News,Photos/Pics,Images..