నా భర్త కడుపులో తన్నాడు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..?

ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు వివాదాల ద్వారా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన అర్జూ గోవిత్రికర్ తన భర్త గురించి సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.

 Naagin 2 Actor Arzoo Govirikar Filed Divorcer Her Husband1-TeluguStop.com

సిద్దార్థ్ శబర్వాల్ నుంచి విడాకులు తీసుకోవడం కొరకు అర్జూ గోవిత్రికర్ సిద్ధమయ్యారు.భర్తపై గృహహింస ఆరోపణలు చేసిన నటి భర్త పెట్టే హింసను తాను భరించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు.

దాదాపు రెండు సంవత్సరాల క్రితం అర్జు గోవిత్రికర్ భర్త హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆమె భర్తలో ఎటువంటి మార్పు రాలేదు.

 Naagin 2 Actor Arzoo Govirikar Filed Divorcer Her Husband1-నా భర్త కడుపులో తన్నాడు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భర్త మరింత ఎక్కువగా హింసిస్తుండటంతో విడిపోవాలని తాను నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు తాను వేధింపులను భరించింది చాలని ఎంతో ప్రయత్నించిన తర్వాతే సిద్దార్థ్ తో కలిసి జీవించడం సాధ్యం కాదని అర్థమైందని అర్జు గోవిత్రికర్ తెలిపారు.

భర్త తనను ఇంటినుంచి గెంటివేయడానికి ప్రయత్నించాడని కడుపుపై తన్నాడని అర్జు గోవిత్రికర్ పేర్కొన్నారు.తనను భర్త ఇష్టానుసారం కొట్టిన రోజులు కూడా ఉన్నాయని ఆ గాయాలను చూపించాలని తాను అనుకోవడం లేదని అన్నారు.పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల తర్వాత భర్త తొలిసారి తనపై చేయి చేసుకున్నారని అతను దాడి చేస్తున్న దృశ్యాలతో పాటు చాటింగ్ కు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అర్జున్ గోవిత్రికర్ చెప్పారు.

Telugu Arzoo Govitkar, Divorce, Her Husband, Naagin 2 Actor, Sensational Comments-Movie

తన భర్తకు రష్యన్ ప్రియురాలు ఉందని ప్రియురాలి గురించి భర్తను అడిగినా ప్రయోజనం లేకపోయిందని అర్జు గోవిత్రికర్ తెలిపారు.కులం పేరుతో భర్త తనను తిట్టేవాడని ఆమె అన్నారు.అయితే సిద్దార్థ్ మాత్రం ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆమె ఏం కావాలంటే అది చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.

#Divorce #Comments #Arzoo Govitkar #Naagin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు