'నా చెలివే' సాంగ్ విడుదల.. మరోసారి సిద్ శ్రీరామ్ మాయలో ఆడియెన్స్!

బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ ర్యాపర్ నోయల్ సీన్, మెహబూబ్, సుమిత బజాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘చకోరి‘.తాజాగా ఈ సినిమా నుండి ‘నా చెలివే’ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ సినిమా సత్య ధానేకుల దర్శకత్వంలో తెరకెక్కింది.ఆస్టా సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు.

 Naa Chelive Lyrical Song Released From Chakori Movie Details, Chakori Movie, Naa-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.కరోనా నేపథ్యంలో ఈ సినిమాను ఇప్పటి వరకు వాయిదా వేశారు.

ఇక త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు.మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకులకు ఈ సినిమాను దగ్గర చేయాలనీ చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుండి నా చెలివే అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు మేకర్స్.

నా చెలివే.రాక్షసివే… నువ్వెవరే. అంటూ సాగే ఈ పాట ఆడియెన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.ఈ పాటకు లీండర్ లీ మార్టీ సంగీతం అందించారు.ఇక ఈ పాట అంత హిట్ అవవడానికి మరొక కారణం సిద్ శ్రీరామ్. అవును ఈ మధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ శ్రీరామ్ పేరు మారుమోగి పోతుంది.

తన గాత్రంతో లక్షలాది ప్రేక్షకులను సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్ మరొకసారి మాయ చేసాడు.తన గొంతుతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్ళాడు.ఈ పాటలో నోయల్ సీన్ ఒక పార్టీలో పాట పాడుతుండగా.మెహబూబ్ గిటార్ ప్లే చేస్తూ కనిపించాడు.ఇక ఈ పాటలో హీరోయిన్ సుమీత బజాజ్ కూడా కనిపించింది.ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube