'నా ఓటు' యాప్ తో : ఇవన్నీ తెలుసుకోవచ్చు... ఇంకా..?

మారిన కాలానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది.తాజాగా…‘నా ఓటు’ అనే యాప్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ గురువారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు.ఈ యాప్‌ ద్వారా దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు సులువుగా చేరుకునే విధంగా రూపొందించారు ఆ యాప్‌ ద్వారా ఓటర్ల జాబితాలో పేరు, పోలింగ్‌ కేంద్ర వివరాలను తెలుసుకోవచ్చు.పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే మార్గం, సౌకర్యాల వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు.

 Na Votu App Launched By Telangana Ec-TeluguStop.com

సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ముందు ఉందని జాయింట్‌ సీఈవో ఆమ్రపాలి తెలిపారు.యాప్‌ విశేషాలను వివరించారు.దివ్యాంగులకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉచిత రవాణా కూడా ఈ యాప్‌ ద్వారా కల్పించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

నా ఓటు యాప్ ఎలా పనిచేస్తుంది…?

* గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి ‘నా ఓటు’ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

* యాప్ ఓపెన్ చేసి దానిలో పేరు, తండ్రి పేరుతో పాటు ఇతర వివరాలు ఎంటర్ చేస్తే.గుర్తింపు కార్డు, పోలింగ్ కేంద్రం వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

* నియోజకవర్గం, అభ్యర్థుల సమాచారం ఆప్షన్‌ ద్వారా ఆ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ పేర్లు తదితర వివరాలు తెలుస్తాయి.

* పికప్ సర్వీస్ అనే కాలమ్‌ను ప్రత్యేకంగా దివ్యాంగ ఓటర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

* దివ్యాంగులు తమ ఎపిక్ సంఖ్యను నమోదు చేస్తే వీరిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి అనే సందేశం స్థానికంగా ఉన్న బీఎల్‌వోకు వెళుతుంది.

* పీడబ్ల్యూడీ వాలంటీర్ల ఆప్షన్ ద్వారా తమ పోలింగ్ కేంద్రం పేరు టైప్ చేస్తే అక్కడి వాలంటీర్ నంబర్, ఫోన్ నెంబర్ వస్తుంది.

వారికి ఫోన్ చేస్తే కేంద్రం వరకు తీసుకెళ్లి.తిరిగి ఇంటి వద్ద దించుతారు.

* యాప్‌లో ఉన్న గూగుల్ మ్యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం పేరు నమోదు చేస్తే జీపీఎస్ సాయంతో నేరుగా కేంద్రానికి చేరుకోవచ్చు.

* దీనితోపాటు దగ్గర్లోని పోలింగ్ కేంద్రం, పోలీస్ స్టేషన్, బస్టాండ్ ఎక్కడుందో తెలుసుకునేందుకు వీలుంది.

ఆన్‌లైన్ ద్వారా:

గూగుల్‌లోకి వెళ్లి ‘‘ https://www.ceotelangana.nic.in/ ’’ టైప్ చేయాలి.

* అక్కడ ELECTORS SEARCHని క్లిక్ చేస్తే అందులో జిల్లాల పేర్లు వస్తాయి.అందులో మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరును క్లిక్ చేయాలి.

* ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలు డిస్ ప్లే అవుతాయి.మీది ఏ నియోజకవర్గమైతే దానిని క్లిక్ చేస్తే మీ పేరు, పోలింగ్ బూత్ నెంబర్లతో సహా కనిపిస్తాయి.

* ఇంటి పేరు, తండ్రి పేరు ఆధారంగా ఓటును నిర్థారించుకోవాలి.పేరు పక్కనే ఉండే పోలింగ్ బూత్ పేరు, నంబరు రాసుకుని నేరుగా ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube