Naa Saami Ranga Review : నా సామి రంగ సినిమా రివ్యూ అండ్ రేటింగ్?

సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రాలలో నా సామి రంగా ( Naa Samiranga ) ఒకటి.

విజయ్ బిన్నీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో నాగార్జున( Nagarjuna ) అల్లరి నరేష్ ( Allari Naresh )రాజ్ తరుణ్( Raj Tharun ) వంటి హీరోలు నటించారు ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.

ఇక సంక్రాంతికి నాగార్జున సినిమా వచ్చింది అంటే తప్పకుండా హిట్ అందుకుంటుంది అనే సెంటిమెంట్ ఉంది అయితే మొదటిసారి ఈయన రీమేక్ సినిమా ద్వారా సంక్రాంతి పండుగ బరిలో దిగారు మరి ఈ సినిమా నాగార్జునకు ఎలాంటి సక్సెస్ అందించింది అనే విషయానికి వస్తే.

కథ:

తమ్ముడు లాంటి అంజి (నరేష్), తండ్రి లాంటి ఊరిపెద్ద (నాజర్)కి అండగా నిలిచిన మొనగాడు కిష్టయ్య (నాగార్జున). సొంత కొడుకు కంటే కూడా కిష్టయ్యనే తన తండ్రి ఎక్కువగా చూసుకోవడంతోతట్టుకోలేకపోతారు దాసు (షబ్బీర్) అండ్ బ్రదర్స్.

ఈ అంతర్యుద్ధం తారా స్థాయికి చేరుకొని చంపుకోవడాల వరకూ వెళ్తుంది.ఈ కథలో వరాలు (ఆషికా రంగనాధ్) పాత్ర ఏమిటి? తనను చంపేయాలి అని చూస్తున్నటువంటి ప్రత్యర్థుల నుంచి కిట్టయ్య ఎలా తప్పించుకున్నారు అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:

నాగార్జున గోదారి యాసలో మాట్లాడుతూ పంచ కట్టులో ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి.ఇక్కడ నరేష్ సన్నివేశాలు ప్రేక్షకులను కొన్నిసార్లు కూడా తెప్పించాయి అంజి గాడి పాత్రలో నరేష్( Allari Naresh ) ఒదిగిపోయినటించారు ఇక రాస్తారు పెద్దగా ఎలివేట్ కాలేదని చెప్పాలి.నటి ఆశికా రంగనాథ్ వయసుకు మించినటువంటి పాత్రలో నటించారనే చెప్పాలి.

Advertisement

ఇక హీరోయిన్ల పాత్రలకు కూడా వారు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్

: దర్శకుడు విజయ్ బిన్ని కొత్త దర్శకుడు అనే విధంగా కాకుండా చాలా అనుభవం ఉన్నటువంటి దర్శకుడిగా స్క్రీన్ ప్లే చూపించారు ఇక కీరవాణి మ్యూజిక్ మంచి సక్సెస్ అయిందని చెప్పాలి.దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది.

విశ్లేషణ:

పండగ వాతావరణంతోపాటు రూరల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాగా నా సామి రంగ సినిమా ఉంది అని చెప్పాలి.నాగార్జున ఘోస్ట్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత సంక్రాంతి పండుగకు ఈ సినిమాకు మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి పండగ పూట ప్రేక్షకులకు కావలసిన మాస్ యాక్షన్ సినిమాని డైరెక్టర్ ప్రేక్షకులకు అందించారని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్

: నాగార్జున నరేష్ నటన స్క్రీన్ ప్లే కీరవాణి( Keeravani ) మ్యూజిక్.

మైనస్ పాయింట్స్:

రాజ్ తరుణ్ పాత్ర, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను సాగదీత.

బాటమ్ లైన్

: ఇలాంటి తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ నా సామి రంగ సినిమా మాత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది అని చెప్పాలి.

రేటింగ్: 3/5

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు