దర్శకుడు ఎన్.శంకర్‎కు భూకేటాయింపుపై హైకోర్టులో విచారణ..!  

tollywood, director n.shankar, land, high court, telangana, rangareddy, - Telugu Director N.shankar, High Court, Land, Rangareddy, Telangana, Tollywood

టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్‎కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడంపై దాఖలైన పిటిషన్‎పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

TeluguStop.com - N Shankar Land High Court Telangana

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

హైదరాబాద్‎లో సినీ స్టూడియో నిర్మాణం కోసం దర్శకుడు ఎన్.శంకర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.దీంతో ప్రభుత్వం ఆయనకు రంగారెడ్డి జిల్లా శంకర్‎పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఐదు ఎకరాల భూమిని కేటాయించింది.అయితే ఎన్.శంకర్‎కు కేటాయించిన భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుందని.చౌకగా భూమిని ఏ విధంగా కేటాయించారంటూ కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

TeluguStop.com - దర్శకుడు ఎన్.శంకర్‎కు భూకేటాయింపుపై హైకోర్టులో విచారణ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రూ.2.50 కోట్ల విలువైన భూమిని ఎకరానికి రూ.5 లక్షల చొప్పున ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.దీనిపై కేబినెట్‎లో నిర్ణయం తీసుకోవడానికి గల ప్రాతిపదిక ఏంటో చెప్పాలని హైకోర్టు కోరింది.

భూకేటాయింపులు ఓ పద్దతి ప్రకారం జరగాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ క్వారంటైన్‎లో ఉన్నారని.

, తమకు కొంత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.దీంతో తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

#Rangareddy #High Court #Land #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

N Shankar Land High Court Telangana Related Telugu News,Photos/Pics,Images..