బాబు దృష్టిలో వైసీపీ పతనానికి పంచాయితీ ఎన్నికల రిజల్ట్స్ కారణమా ?!

ఆంధ్రప్రదేశ్పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ దూసుకెళ్తోంది.వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూడా టీడీపీ సర్పంచ్ మద్దతుదారులు గెలవడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

 Nbabusview Panchayat Election Results Are The Reason For The Fall Of Ycp Chandra-TeluguStop.com

రెండో దశ ఎన్నికల్లో టీడీపీ దాదాపు600లకు పైగా టీటీపీ సీట్లు కైవసం చేసుకుంది తదుపరి ఎన్నికల్లో సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోందని టీటీపీ అధినేతచంద్రబాబు తెలిపారు.

ఇక మరోవైపు అమరావతిలో మీడియా ముందుకొచ్చిన చంద్రబాబు మొదటి రెండు దశల్లో జరిగిన ఓట్ల శాతాన్ని చూస్తే వైసీపీ పతనం ప్రారంభమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 39శాతానికిపైగా స్థానాల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులే గెలిచారని ఆయన అన్నారు.అంతేకాదు రాష్ట్ర ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని వైసీపీ ఎంపీలు, మంత్రులకు కంచుకోటగా చెప్పుకునే స్థానాల్లోనూ టీడీపీ సత్తా చాటిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

ఇక దీన్ని బట్టి చుస్తే రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు, మంత్రులకు వారి సొంత గ్రామాల్లోనూ మద్దతు లేకుండా పోతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.ఇక ప్రజలు వైసీపీ నేతలను నిలదీశారని ఓడించారని అన్నారు.

వారి అరాచకాల వల్ల ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు పంచాయతీ ఎన్నికల్లో82శాతంపోలింగ్ కావడం అధికార పార్టీ పతనానికి నాంది అని చంద్రబాబు అన్నారు నా జీవితంలో తొలి సారి పంచాయతీ ఎన్నికల్లో ఇంతటి భారీ పోలింగ్ జరగడం అధికార పార్టీపై వ్యతిరేకతతోనే జరిగిందని చంద్రబాబు అన్నారు.

ఇక వైసీపీ నేతలతో సహకరించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని చంద్రబాబు ఘీంకరించారు.

తాము అధికారంలోకి వచ్చాక అందరిపై చర్యలు తీసుకుంటామని బాబు గారు హెచ్చరించారు.మొత్తంగా చంద్రబాబులో పంచాయతీ ఎన్నికల జోష్ వచ్చేసింది.భారీగా పోలింగ్ జరగడం మంత్రులు, ఎమ్మెల్యేల సొంతూళ్లలో కూడా టీడీపీ గెలవడంతో బాబులో కూసింత సంతోషం వెల్లివిరిసిందనే చెప్పాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube