సల్మాన్ ఖాన్ మూవీ తో బాలీవుడ్ ఎంట్రీకి మైత్రీ  

Mytri Movie Makers Plan To Hindi Movie With Salman Khan - Telugu Bollywood, Indian Cinema, Mytri Movie Makers Plan To Hindi Movie, Salman Khan, Tollywood

టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు నిర్మిస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో రూల్ చేస్తున్న స్టార్ హీరోలందరితో సినిమాలకి అగ్రిమెంట్లు చేసుకొని హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాయి.

Mytri Movie Makers Plan To Hindi With Salman Khan - Telugu Bollywood Indian Cinema Tollywood

ఓ విధంగా చెప్పాలంటే తెలుగులో దిల్ రాజు తర్వాత ఆ స్థాయిలో హవా సృష్టిస్తున్న నిర్మాణ సంస్థ అంటే మైత్రీ మూవీ మేకర్స్ వారే.ఈ నిర్మాణ సంస్థ త్వరలో పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సంస్థ నిర్మాతలు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అల్లు అరవింద్, సురేష్ ప్రొడక్షన్ తరహాలోనే బాలీవుడ్ లో అడుగుపెట్టాలని ప్రయత్నం మొదలెట్టారు.

తమ మొదటి సినిమాని స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.దీని కోసం సల్మాన్ ఖాన్ బ్రదర్స్ తో చర్చించడం కూడా జరిగినట్లు తెలుస్తుంది.

త్వరలో సల్మాన్ ఖాన్ తో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.అయితే మైత్రీ వారు సల్మాన్ ఖాన్ తో చేసే సినిమా తెలుగు మూవీ రీమేక్ అని తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైత్రీలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీని సల్మాన్ ఖాన్ తో హిందీలో రీమేక్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

Mytri Movie Makers Plan To Hindi Movie With Salman Khan-indian Cinema,mytri Movie Makers Plan To Hindi Movie,salman Khan,tollywood Related....