సీతారామం డైరక్టర్ కి మైత్రి ఆఫర్..!

అందాల రాక్షసి సినిమా నుంచి సీతారామం వరకు ప్రేమకథలను తీస్తూ తన సత్తా చాటుతూ వచ్చాడు డైరక్టర్ హను రాఘవపుడి.అయితే అంతకుముందు సినిమాలు అతనికి కమర్షియల్ సక్సెస్ అవలేదు.

 Mytri Movie Makers Offer For Sitharamam Director Hanu Raghavapudi , Dulquer Sal-TeluguStop.com

సీతారామం సినిమా హను కెరియర్ లో బెస్ట్ మూవీగానే కాదు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది.దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటించిన సీతారామం సినిమా హిట్ అవడంతో హనుకి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రముఖ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హను రాఘవపుడికి ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది.హనుకి మైత్రి వారు అడ్వాన్స్ కూడా ఇచ్చారట.

స్టార్ హీరోకి కథ సిద్ధం చేయమని చెప్పారట.ఆల్రెడీ తన దగ్గర ఉన్న రెండు కథలను మైత్రి వారికి వినిపించాడట హను.ఇదేకాదు హను రాఘవపుడికి బాలీవుడ్ నుంచి కూడా డైరక్షన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.ఒక్క సినిమాతో హను తన ఫేట్ మార్చుకున్నాడని చెప్పొచ్చు.

 మైత్రి మూవీ మేకర్స్ హను రాఘవపుడి కాంబినేషన్ లో ఓ క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారట.ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube