అరుదైన కాంబోను సెట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌

ప్రస్తుతం టాలీవుడ్‌ లో అత్యధికంగా సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ ఏదంటే అది ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ అనడంలో సందేహం లేదు.బాలీవుడ్‌ కోలీవుడ్‌ ల్లో కూడా వీరు సినిమాలు తీస్తున్నారు.

 Mythri Movie Makers Two Films With Mega Hero Vaishnav Tej , Mythri Movie Makers,-TeluguStop.com

ఇక టాలీవుడ్‌ లో యంగ్‌ హీరోలు స్టార్‌ హీరోలు అందరికి కూడా అడ్వాన్స్ లు ఇచ్చేసి ఉన్నారు.పవన్‌ నుండి మొదలుకుని నాని వరకు ఎంతో మంది తో సినిమా లు చేస్తున్న మైత్రి వారు తాజాగా మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తో ఉప్పెన సినిమా తెరకెక్కించిన విషయం తెల్సిందే.

కొత్త హీరో కొత్త దర్శకుడు అయినా కూడా వారు భారీగా పెట్టుబడి పెట్టి తీసిన తీరు నిజంగా అభినందనీయం.ఉప్పెన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.మైత్రి వారికి ఆ సినిమా దాదాపుగా 50 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

అందుకే తమకు అంతగా లాభాలను తెచ్చి పెట్టిన వైష్ణవ్‌ తేజ్‌ తో ఏకంగా రెండు సినిమాలకు ఒప్పందం చేసుకున్నారు.

Telugu Chiranjeevi, Mytri Makers, Tollywood, Vaishnav Tej, Uppena, Vaishnavtej,

వైష్ణవ్‌ తేజ్ హీరోగా ఒక యంగ్‌ డైరెక్టర్ తో సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యారు.రెండు సినిమాలు కూడా వరుసగా ఉంటాయని తెలుస్తోంది.వచ్చే ఏడాది లో రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తాయని అంటున్నారు.

వైష్ణవ్‌ తేజ్ తో ఆ యంగ్‌ స్టార్‌ డైరెక్టర్‌ మూవీ ఖచ్చితంగా ప్రేక్షకులకు అద్బుతమైన సినిమాను అందజేస్తుందని మైత్రి మూవీ మేకర్స్ చెబుతున్నారు.ఆ దర్శకుడు ఎవరు అనేది అతి త్వరలోనే రివీల్‌ చేస్తామని అంటున్నారు.

వైష్ణవ్‌ తేజ్ కోసం ఆ దర్శకుడు తయారు చేసిన కథకు చిరంజీవి తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ వారు కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి వైష్ణవ్‌ తేజ్‌ తో ఒక అరుదైన క్రేజీ కాంబోను సెట్‌ చేసిన మైత్రి వారు ఖచ్చితంగా మరో లెవల్ లో సినిమా ను నిర్మిస్తారనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

వైష్ణవ్‌ రెండవ మరియు మూడవ సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది.నాల్గవ సినిమా గా మైత్రి బ్యానర్ లో రూపొందబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube