రాజమౌళితో మరో భారీ చిత్రాన్నీ ప్లాన్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ..?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి “RRR” చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు.అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించారు.

 Mythri Movie Makers Met Rajamouli Today-TeluguStop.com

ఇదిలా ఉండగా “RRR” తరువాత రాజమౌళి తీయబోయే సినిమా ఏంటి? కథానాయకుడు ఎవరు? అనే విషయం గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా దర్శక ధీరుడు జక్కన్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలను కలిసినట్లు తెలుస్తోంది.

 Mythri Movie Makers Met Rajamouli Today-రాజమౌళితో మరో భారీ చిత్రాన్నీ ప్లాన్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ లో తెరకెక్కని భారీ బడ్జెట్ చిత్రాన్ని వీరిద్దరి కాంబోలో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయి అనే సమాచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వినబడుతోంది.

ఈ సినిమా కథ ఏమిటి ఇందులో కథానాయకుడు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

Telugu Action Thriller Movie, Big Movie, Huge Budget Movie, Mahesh Babu, Mythri Movie Makera, Ntr, Raja Mouli Next Movie Update, Rajamouli, Rajamouli Mahesh Babu, Ram Charan, Tollywood-Movie

రాజమౌళి “RRR” తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నారు.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి.అయితే అప్పటివరకు రాజమౌళి మహేష్ బాబు కోసం వేచి చూస్తారా.

లేకపోతే మరో హీరోతో తన తర్వాత ప్రాజెక్టును ప్రారంభిస్తారా.అనే విషయం తెలియాల్సి ఉంది.

#Mahesh Babu #Big #Thriller #Mythri Makera #Huge Budget

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు